Constipation : రోజూ ఉద‌యాన్నే దీన్ని తాగాలి.. మ‌ల‌బ‌ద్ద‌కానికి చ‌క్క‌ని ఔష‌ధం..

Constipation : వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య కూడా ఒక‌టి. మ‌ల‌బ‌ద్ద‌కంతోపాటు గ్యాస్, అజీర్తి, క‌డుపులో మంట వంటి ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో కూడా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను తేలిక‌గా తీసుకోకూడ‌దు. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి కూడా ఇది దారి తీస్తోంది. క‌నుక మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా అలాగే శాశ్వ‌తంగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డేయ‌డంలో క‌మ‌లా పండ్లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చూడ‌గానే తినాలనిపించే ఈ క‌మ‌లా పండ్ల‌లో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు క‌మ‌లా పండ్ల‌ను ఎలా తీసుకుంటే ఏం ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక పెద్ద క‌మ‌లా పండును తీసుకుని పైన పొట్టును తీసేయాలి. త‌రువాత గింజ‌ల‌ను వేరు చేసి తొన‌ల‌ను జార్ లో వేయాలి.

orange juice is the best remedy for Constipation
Constipation

ఇందులోనే రుచికి త‌గినంత పింక్ సాల్ట్ ను, ఒక గ్లాస్ నీళ్లను, ఒక టీ స్పూన్ తేనెను వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న క‌మ‌లా పండు జ్యూస్‌ను వ‌డ‌క‌ట్ట‌కుండా అలాగే తీసుకోవాలి. ఈ జ్యూస్ ను రోజూ ఉద‌యం తీసుకోవ‌డం వల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య తగ్గుతుంది. ఇలా తయారు చేసుకున్న క‌మ‌లా పండ్ల జ్యూస్ ను పిల్ల‌లు కూడా తీసుకోవ‌చ్చు. ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గడంతోపాటు శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థ ప‌దార్థాలు కూడా తొల‌గిపోతాయి. ఈ విధంగా క‌మ‌లా పండును ప‌ది రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

Share
D

Recent Posts