Pelu Home Remedies : మనలో చాలా మంది తలలో పేల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా స్త్రీలు, ఆడపిల్లలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. పేల కారణంగా తలలో దురద, చికాకు, కోపం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పేల వల్ల బాధను అనుభవించినప్పటికి మనలో చాలా మందికి పేల గురించి అనేక విషయాలు తెలియవు. సాధారణంగా పేలు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిస్తూ ఉంటాయి. కానీ వీటి కారణంగా తలలో ఉండే ఇన్పెక్షన్ లు ఒకరి నుండి మరొకరికి వ్యాపించవు. రోగాలను వ్యాప్తి చేసే గుణం పేలకు లేదని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. అలాగే పేలు 28 రోజులు మాత్రమే బ్రతుకుతాయి. ఆడ పేనుకు పది రోజుల వయసు వచ్చిన దగ్గర నుండి గుడ్లు పెట్టే యోగ్యత వస్తుంది. అలాగే ఆడపేను మగ పేనుతో కలిసిన 24 గంటల్లోనే గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది.
ఒక ఆడ పేను రోజుకు 4 నుండి 5 గుడ్లు పెడుతుఉంది. ఆడ పేను తన జీవిత కాలంలో 50 నుండి 125 గుడ్లు వరకు పెడుతుంది. ఒక గుడ్డు పేనుగా మారడానికి 8 రోజుల సమయం పడుతుంది. అలాగే ఈ గుడ్లు కింద పడిపోకుండా ఉండడానికి ఆడ పేను మన వెంట్రుకల మీద జిగురును స్రవించి ఆ జిగురుకు గుడ్లను అతికిస్తుంది. జిగురు కారణంగా గుడ్లు పిల్లలు అయ్యే వరకు ఊడిపోకుండా ఉంటాయి. అలాగే పేలు 55 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. 55 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటిని పోసినప్పుడు పేలు చనిపోతాయి. చాలా మంది పేల సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల షాంపులను, మందులను, లోషన్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియదు కానీ సహజంగా లభించే వేప నూనెను వాడడం వల్ల పేల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వేప నూనెలో అజాదిరిచిటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది పేలను నిర్మూలించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పేల సమస్యతో బాధపడే వారు వేప నూనెను జుట్టుకు పట్టించాలి. దీనిని ఒక అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. వేపనూనెను వాడిన ఒక్కరోజులోనే మనం మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా వేప నూనెను వాడడం వల్ల మనం చాలా సులభంగా పేల సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.