చిట్కాలు

బియ్యం నీళ్ళతో మీ జుట్టు పదిలం..ఎలా అంటే..!!!

బియ్యం నీళ్ళలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు ముఖ్యంగా జుట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పద్దతులు పూర్వం ఆచరించే వారు కానీ ప్రస్తుతం అలవాటు పడిన బ్యూటీ పార్లర్ పద్ధతుల నుంచీ బయటకి రాలేక పూర్వపు పద్దతులు తెలియక పోవడంతో ఎంతో మంది తమ సహజ అందాన్ని కోల్పోయి చివరికి మేకప్పు మెరుగులలో మెరిసి పోతున్నారు. చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి కాపాడుకునే సౌందర్యాన్ని వేలకు వేలుపోసి పాడుచేసుకుంటున్నారు అందుకే ఇంట్లో ఉంటూ మీ జుట్టు సంరక్షణ ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.

రోజు వారి మనం అన్నం వాడుకుంటాం. అందుకు గాను బియ్యాన్ని నీళ్ళలో కడిగి తరువాత అన్నం వండుతాం. ఇదే పద్దతిలో మీరు చేయాల్సింది ఏమిటంటే. ఒక గ్లాసుడు బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని నీటిలో 20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తరువాత బియ్యాన్ని బాగా గట్టిగా పిండి నీటిని వడగట్టాలి. ఇలా వచ్చిన నీటిని కురులకి మెల్లగా పట్టించాలి.

rice water for hair works effectively

కురులకి పట్టించే ముందుగా కురుల కుదుళ్ళకి వెళ్ళేలా చేసుకోవాలి. ఎప్పుడైతే కుదుళ్ళ కి బియ్యం నీరు చేరుతుందో ఆ నీటిలో ఉండే పోషక విలువలు. కుదుళ్ళని ధృడంగా చేస్తాయి. అంతేకాదు జుట్టు ఒత్తుగా, పొడవుగా రావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మాడుపైనే ఉండే చర్మం నిర్జీవంగా ఉండటం వలెనే జుట్టు అధికంగా ఊడిపోవడం మళ్ళీ జట్టు రాకపోవడం జరుగుతుంది. ఈ బియ్యం నీళ్ళని పట్టించడం వలన చర్మం పునరుత్తేజాన్ని కలుగుతుంది. జుట్టుని పట్టి ఉంచుతుంది.

Admin