Andhra Style Pappu Charu : ఆంధ్రా స్టైల్‌లో ప‌ప్పు చారును ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Andhra Style Pappu Charu : ప‌ప్పు చారు.. మ‌నం ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ప‌ప్పుచారును పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ప‌ప్పుచారును మ‌నం త‌రుచూ ఇంట్లో త‌యారు చేస్తూనే ఉంటాము. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ప‌ప్పుచారు ఎప్పుడు చేసిన ఒకే రుచితో ఉంటుంది. మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా, సుల‌భంగా ప‌ప్పుచారును ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ప్పుచారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నీళ్లు – 2 క‌ప్పులు, నానబెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, కారం – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Andhra Style Pappu Charu recipe very tasty with rice know how to make it
Andhra Style Pappu Charu

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 5, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ఇంగువ – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

ప‌ప్పుచారు త‌యారీ విధానం..

ముందుగా కందిప‌ప్పును శుభ్రంగా క‌డిగి నాన‌బెట్టాలి. త‌రువాత కందిప‌ప్పును కుక్క‌ర్ లోకి తీసుకుని అందులో నీళ్లు, ప‌సుపు, ట‌మాట‌, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి మూత పెట్టి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత కారం, ఉప్పు, కొత్తిమీర‌, చింత‌పండు ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత 2 గ్లాసుల నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ ను స్ట‌వ్ మీద ఉంచి మ‌రిగించాలి. దీనిని 6 నుండి 7 నిమిషాల పాటు మ‌రిగించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసివేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత చారు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు మ‌రిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ప్పుచారు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.ఈ విధంగా త‌యారు చేసిన ప‌ప్పుచారును లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts