Sleeplessness : ఏం చేసినా నిద్ర ప‌ట్ట‌డం లేదా ? వీటిని తీసుకుంటే ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Sleeplessness : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది రోజూ అనేక ఒత్తిళ్ల న‌డుమ ప‌నిచేస్తున్నారు. దీంతో ఆందోళ‌న‌, డిప్రెష‌న్ బారిన ప‌డుతున్నారు. ఇవ‌న్నీ నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు కార‌ణ‌వుతున్నాయి. రాత్రి పూట చాలా ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. ఉద‌యం నిద్ర త్వ‌ర‌గా లేవ‌లేక‌పోతున్నారు. ఇది ఇంకా మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. అయితే కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో నిద్ర బాగా ప‌డుతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

Sleeplessness troubles you follow these home remedies
Sleeplessness

1. రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా తేనె క‌లిపి తాగాలి. లేదా అశ్వ‌గంధ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో క‌లిపి తాగ‌వ‌చ్చు. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్యలు కూడా త‌గ్గుతాయి.

2. రాత్రి భోజ‌నం అనంత‌రం ఒక గ్లాస్ నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్క‌ను వేసి మ‌రిగించి ఆ నీటిని తాగాలి. దీంతో నిద్ర బాగా ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు.

3. రాత్రి నిద్ర‌కు ముందు ఒక క‌ప్పు ద్రాక్ష పండ్ల‌ను తిన్నా.. లేదా జ్యూస్ తాగినా చాలు.. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. రాత్రి భోజ‌నం అనంత‌రం ఒక టీస్పూన్ మెంతుల‌ను ఒక క‌ప్పు నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని తాగాలి. దీని వల్ల కూడా నిద్ర బాగా ప‌డుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts