Ginger And Jaggery : అల్లం, బెల్లం క‌లిపి నూరి రోజుకు రెండు సార్లు తీసుకుంటే.. అద్భుత‌మైన లాభాలు..

Ginger And Jaggery : అన్ని రోగాలను నయం చేసే మందులకు నిలయం మన వంటిల్లు. సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను వంటింట్లో ఉండే పదార్దాలతోనే నయం చేసుకోవచ్చు. జలుబు చేసినా, తలనొప్పి వచ్చినా ప్రతి దానికి నానా హైరానా పడిపోతూ హాస్పిటళ్ల‌ చుట్టూ పరుగులు పెడితే సమయం, డబ్బూ రెండూ వృథా. కాబట్టి అప్పుడప్పుడూ వంటింటి వైద్యాన్ని కూడా అనుసరించాలి. అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండి నిత్యం వంటకాల్లో ఉపయోగపడుతూ, మనం ఎదుర్కొనే పలు రుగ్మతల నుండి కాపాడే ఔషధం అల్లం. ఈ అల్లంలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..

ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి దాని రసం, రెండు టీస్పూన్ల అల్లం రసం, రెండు స్పూన్ల తేనె, రెండు టీస్పూన్ల ధనియాల రసం కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె దడ, తల తిప్పడం, తలనొప్పి, అలసట తగ్గుతాయి. రెండు టీస్పూన్ల అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగుతుంటే శరీరంపై వచ్చే దద్దుర్లు, తరచుగా జలుబు, తుమ్ములు రావడం, దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి. పులి తేన్పులు తగ్గి జీర్ణశక్తి మెరుగవుతుంది.

take Ginger And Jaggery mixture daily for these benefits
Ginger And Jaggery

అల్లం, బెల్లం సమానంగా కలిపి నూరి రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే అరికాళ్లు, చేతుల్లో పొట్టు ఊడటం తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం లేకుండా సుఖ విరేచనం అవుతుంది. ఒక టీస్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం.. తరచుగా, అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గి.. శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

తులసి ఆకులు, పసుపు, అల్లం రసంతో నూరి దద్దుర్లు, దురద, మచ్చలు, మొటిమలు మొదలైన వాటిపై రాస్తుంటే అవి త్వరగా తగ్గుతాయి. ఆముదంలో అల్లపు రసం కలిపి చర్మానికి రాస్తే వివిధ ర‌కాల చర్మ వ్యాధులు తగ్గుతాయి.

Editor

Recent Posts