Thighs Darkness : తొడ‌ల ద‌గ్గ‌ర న‌లుపును సుల‌భంగా పోగొట్టుకోండి.. ఈ చిట్కాలను పాటించండి..!

Thighs Darkness : ఊబ‌కాయం కార‌ణంగా కొంద‌రిలో తొడ‌లు ఒక దానితో ఒక‌టి రాసుకుపోయి ఆ ప్రాంతంలో చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. కొంద‌రిలో శ‌రీర‌మంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ తొడ‌ల భాగంలో మాత్రం చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. న‌ల్ల‌గా ఉన్న చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా తేలికైన ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి తొడ‌ల భాగంలో న‌ల్ల‌గా ఉన్న చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. న‌ల్ల‌టి చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తొడ‌ల భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా ఉన్న వారు ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. మొద‌టి చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గాను మ‌నం నిమ్మ‌కాయ‌ను, కొబ్బ‌రి నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల కొబ్బ‌రి నూనెను వేయాలి. త‌రువాత ఇందులో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని పిండి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని బాహుమూల‌ల్లో, తొడ‌ల భాగంలో న‌ల్ల‌గా అయిన చ‌ర్మంపై రాసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత గోరువెచ్చ‌ని నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు క్ర‌మం త‌ప్ప‌కుండా ఇలా చేయ‌డం వ‌ల్ల నలుపు పోయి చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది.

Thighs Darkness follow these home remedies
Thighs Darkness

కొబ్బ‌రి నూనె నలుపును త‌గ్గించి చ‌ర్మాన్ని మెత్త‌గా, సున్నితంగా మారుస్తుంది. నిమ్మ‌కాయ‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ బ్లీచింగ్ ఏజెంట్ లా ప‌ని చేసి న‌లుపును త‌గ్గిస్తుంది. ఇక రెండ‌వ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గాను పెరుగును, నిమ్మ‌కాయ‌ను, శ‌న‌గ‌పిండిని, ప‌సుపును ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీనికోసం ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పెరుగును తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ శ‌న‌గ‌పిండిని, అర టీ స్పూన్ ప‌సుపును, అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని వేయాలి.

ఇప్పుడు వీట‌న్నింటిని బాగా క‌లిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని తొడ‌ల భాగంతోపాటు చ‌ర్మం న‌ల్ల‌గా ఉన్న ఇత‌ర శ‌రీర భాగాలపై కూడా రాసుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని రాసిన 20 నిమిషాల త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు నుండి నాలుగు సార్లు క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల తొడ‌ల భాగంతోపాటు ఇత‌ర భాగాల‌లో న‌ల్ల‌గా ఉన్న చ‌ర్మాన్ని కూడా తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

D

Recent Posts