చిట్కాలు

పురుషుల పలుచ‌ని జుట్టుకు ఎలాంటి చికిత్స చేయాలి..?

మహిళలకు సమానంగా పురుషులు వివిధ హెయిర్ స్టయిల్స్‌పై మక్కువ చూపుతున్నారు. అయితే జట్టు మాత్రం పలుచ‌గా ఉందని బాధపడుతున్నారా. అయితే ఏం చేయాలంటే.. ఆకుకూరలు, కాయగూరలు వంటివి తీసుకుంటూనే.. స్టయిలింగ్ జెల్స్ వాడండి. స్ప్రే జెల్స్ చిన్ని చిన్ని పాలిమర్స్ డ్రాప్ లెట్స్‌ను వెలువరిస్తాయి. తద్వారా మీకు నచ్చిన స్టయిల్లో హెయిల్ స్టయిల్ చేసుకోవచ్చు. ఇక పోమేడ్స్ నూనె ఆధారితంగా ఉండి జుట్టుకు అదనపు మెరుపునిస్తాయి.

హెయిర్ వ్యాక్స్‌లు వాడితే శిరోజాలను దగ్గరగా పేర్చి గట్టిగా ఉండేలా చూపుతాయి. పేస్ట్ ఆయిల్, వ్యాక్స్ కలయికతో ఉంటుంది. హెయిర్ క్రీమ్స్, నూనె, వ్యాక్స్, పాలిమర్స్ కలగలిసి ఉండి పూర్తిస్థాయి నియంత్రణకు అవకాశం ఇస్తాయి. ఏది ఎంచుకున్నా విడిగా, దానిపై సూచనల మేరకు వాడాలి. కొద్దిపాటి జెల్ చాలు. అరచేతిలో వేసుకుని శిరోజాలకు పట్టించాలి. మాడు పొడిగా ఉన్నా, చుండ్రు ఉన్నా ఆల్కహాల్ లేని స్టయిలింగ్ జెల్ వాడాలి.

thin hair in men wonderful home remedy

ఆపిల్ పండు ముక్కలను మరిగించి వడకట్టి చల్లారిన తర్వాత తేనెకలిపి ఆ నీటిని కంటిని శుభ్రపరిచేందుకు వాడుకుంటే కళ్ళు తాజాగా ఉంటాయి. ఆపిల్ రసం తీసుకుంటే మలబద్ధకం తగ్గిపోతుంది. హృదయ రుగ్మతలకు అంజీర్ పండ్ల‌ను తీసుకుంటే హృదయశూల తగ్గుతుంది. కమలాపండు రసం తాగితే దంతాలలో ఏర్పడే రంధ్రాలను తొలగిస్తుంది. లేత మామిడి చిగురు పంటి నొప్పులు, దగ్గులను తగ్గిస్తుంది.

మామిడి ర‌సాన్ని రోజుకు రెండుసార్లు తాగితే బరువు పెరుగుతారు. ఇక నారింజ పెచ్చులు నాలుగు గ్రాములను రెండు కప్పుల నీటితో కాచి ఆ కషాయాన్ని సేవిస్తే గర్భస్రావం జరగకుండా నివారిస్తుంది.

Admin

Recent Posts