హెల్త్ టిప్స్

వేడినీటి స్నానంతో విసుగు, చికాకులను వాష్ చేసేయండి..!

రోజంతా పని.. పని విపరీతమయిన అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలుకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు, వేడెక్కిన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా మారేందుకు దీనికి మించిన మందు బహుశా లేనేలేదు. చర్మానికి కూడా మంచిది.

నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలుపుకుంటే మనస్సంతా తేలిక పడుతుంది. మంచి మూడ్‌లోకి వచ్చేస్తారు. సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోండి. తడి టవల్‌ను తలకు చుట్టుకుని కొద్దిసెపు రిలాక్సవ్వండి. మంద్రమైన సంగీతాన్ని ఆస్వాదించండి. ఇలా చేయడం వలన కొద్ది నిమిషాల తరువాత అద్భుతమయిన ఆనందం సొంతం అవుతుంది. కాంతులతో తాజాగా బయటకు వచ్చేస్తారు.

do hot water bath to get rid of these problems

శిరోజాల కొసలు చిట్లుతుంటే గోరువెచ్చని ఆముదంలో ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించండి. శిరోజాలను టవల్‌తో చుట్టి ఒక అరగంట సేపు అలా ఉంచండి. తర్వాత షాంపూతోపాటు గుడ్డులోని పచ్చసొనను కలిపి తలంటు స్నానం చేయండి. గ్యాలన్ చన్నీటికి అరకప్పు యాపిల్ సిడెర్ వెనిగర్‌ను కలిపి ఆ నీళ్ళతో శిరోజాల్ని శుభ్రం చేసుకోవాలి. శిరోజాలపై ఏమీ మిగలకుండా మంచి నీళ్ళతో మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకోవాలి.

జుట్టు పలచబడుతున్నట్టయితే సల్ఫర్ అధికంగా వున్న ఆహారాలను ఎక్కువ‌గా తీసుకోండి. క్యాబేజి, బ్రస్సెల్స్, మొలకెత్తిన గింజలు, క్యాలీఫ్లవర్లో సల్ఫర్ ‌అధిక మోతాదులో వుంటుంది. బి విటమిన్లు అధికంగా వున్న ఆహారాలను కూడా ఎక్కువ‌గా తినాలి.

Admin

Recent Posts