చిట్కాలు

నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలా?! ఇవిగోండి చిట్కాలు..

నోటినుండి దుర్వాసన వస్తుంటే పక్కనున్నవారికి మహా ఇబ్బందిగా వుంటుంది. నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసన వదిలించుకునేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. ప్రతి సారీ తప్పక నాలుక గీచుకోవాలి. నాణ్యమైన నాలుక బద్దతో ఆ పని చేయాలి.

పెరుగుతున్న నోటి దుర్వాసన ఆగిపోవాలంటే రోజులో ఒకసారి అయినా పెరుగును తినండి. విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా కలిగిన కాయగూరలు, పండ్లు ఎక్కువ‌గా తినండి. క్యారెట్, యాపిల్, బత్తాయి వంటి పండ్లు, కూరలు మంచివి.

wonderful home remedies to reduce bad breath

టీ తాగడం వలన టీలోని రసాయనాలు నోటి దుర్వాసనను పెరగకుండా అవుతాయి. నోటిని ఎండిపోయిన స్థితిలో వుంచవద్దు. నీరు ఎక్కువగా తీసుకోవాలి. నోటిలో వుమ్మి వుంటే వాసన తగ్గుతుంది.

నోటి దుర్వాసనకు విరుగుడుగా మౌత్‌వాష్‌ని వాడతారు. అయితే మౌత్‌వాష్‌లో తప్పకుండా ఆల్కహాల్ వుంటుంది. ఆ ఆల్కహాల్ వల్ల నోరు ఎండిపోయినట్లు అవుతుంది. కాబట్టి ఆల్కహాల్ లేనటువంటి మౌత్‌వాష్‌ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

Admin

Recent Posts