Triphala Churna Water : ప్రస్తుత కాలంలో మారిన మన జీవన విధానం అలాగే ఆహారపు అలవాట్ల కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాము. ముఖ్యంగా చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్దకం, కడుపు ఉబ్బరం, పుల్లటి త్రేన్పులు, ఆకలి లేకపోవడం వంటి అనేక రకాల జీర్ణసంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ సమస్యలు రావడానికి అస్థవ్యస్థమైన మన జీవన విధానమే ప్రధాన కారణం. చాలా మంది ఈ సమస్యల బారి నుండి బయట పడడానికి అనేక రకాల మందులను వాడుతూ ఉంటారు. మందులను వాడడం వల్ల సమస్య కొంతమేర తగ్గినప్పటికి వీటి వల్ల దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి.
ఇటువంటి జీర్ణ సంబంధిత సమస్యల నుండి మనం సహజ సిద్దంగా కూడా బయట పడవచ్చు. మనకు వచ్చే వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలను సహజసిద్దంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో మనకు త్రిఫలా చూర్ణం, తిప్ప తీగ చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయలు, తానికాయ, కరక్కాయ.. ఈమూడు కాయలతో తయారు చేసిందే త్రిఫలా చూర్ణం. ఇవి ఒక్కోటి 100 రోగాలను నయం చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఈ త్రిఫలా చూర్ణం మనకు ఆయుర్వేద షాపుల్లో విరివిరిగా లభిస్తుంది.
జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు మనకు వచ్చే ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా త్రిఫలా చూర్ణం మనకు దోహదపడుతుంది. అదే విధంగా తిప్ప తీగ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. దీనిని అమృతవల్లి అని కూడా అంటారు. తిప్ప తీగ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తుంది. మనకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ రెండు చూర్ణాలతో జీర్ణ సంబంధిత సమస్యలను ఎలా తగ్గించుకోవాలి. ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ తిప్ప తీగ చూర్ణం, ఒక టీ స్పూన్ త్రిఫలా చూర్ణం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజుకు మూడు పూటలా తాగాలి.
ఇలా తాగడం వల్ల 15 రోజుల్లోనే గ్యాస్, అసిడిటీ, మలబద్దం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ప్రేగులు కడిగినట్టు శుభ్రపడతాయి. ఆకలి పెరుగుతుంది. ఇలా నీటిని తాగుతూనే రోజుకు రెండు పూటలా పండ్లను తినాలి. ఒక్క పూట మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా సులభంగా, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.