Ulcer Remedy : అల్స‌ర్లు, క‌డుపులో మంట‌కు దివ్యౌష‌ధం ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Ulcer Remedy : మ‌న పొట్ట‌లో ఆహారాన్ని జీర్ణం చేయ‌డానికి గానూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుద‌ల అవుతుంది. ఈ యాసిడ్ రోజుకు రెండు నుండి రెండున్న‌ర లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. కొంద‌రిలో ఇది మూడు లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది.ఈ గాఢ‌త 0.8 పి హెచ్ నుండి 1.2 పి హెచ్ మ‌ధ్య‌లో ఉంటుంది. ఈ యాసిడ్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న క్రిముల‌ను న‌శింప‌జేయ‌డానికి, ఆహారాన్ని జీర్ణం చేయ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆరోగ్యంగా ఉన్న వారిలో ఈ యాసిడ్ లీట‌న్న‌ర నుండి రెండు లీట‌ర్ల మోతాదులో త‌యార‌వుతుంది.

కానీ కొంద‌రిలో మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా,ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వ‌ల్ల, కోపం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల‌, టీ మ‌రియు కాఫీల‌ను ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం గోడ‌లు ఈ యాసిడ్ సాంధ్ర‌త‌ను త‌ట్టుకోలేక పోతాయి. దీంతో అల్స‌ర్లు, క‌డుపులో మంట, క‌డుపులో అసౌక‌ర్యంగా ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి వివిధ ర‌కాల టానిక్ ల‌ను, మందుల‌ను వాడుతూ ఉంటారు.

Ulcer Remedy in telugu use shatavari in this way
Ulcer Remedy

వీటిని వాడ‌డం వ‌ల్ల ఉప‌శ‌మ‌నం ఉన్న‌ప్ప‌టికి వాటి వల్ల భ‌విష్య‌త్తులో అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక స‌హ‌జ ప‌దార్థాలను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డం ఉత్త‌మం. స‌హ‌జ సిద్దంగా కూడా మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఉత్ప‌త్తిని త‌గ్గించి దాని స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంలో మ‌న‌కు శ‌తావ‌రి పొడి మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని నిపుణులు క‌నుగొన్నారు. క‌డుపులో మంట‌ను, అల్స‌ర్ల‌ను త‌గ్గించి జీర్ణక్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో కూడా శ‌తావ‌రి పొడి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. 2005 వ సంవ‌త్స‌రంలో ఉద‌య్ పూర్ లోని మోహ‌న్ లాల్ యూనివ‌ర్సిటి వారు ఈ విష‌యాన్ని క‌నుగొన్నారు.

ఈ శ‌తావ‌రి పొడిని ఎలా ఉప‌యోగించ‌డం వ‌ల్ల పొట్ట‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయిలు క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌బ‌డ‌తాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో ఒక టీ స్పూన్ శ‌తావ‌రి పొడిని వేసి అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట‌లో వ‌చ్చే అసౌక‌ర్యం నుండి మ‌న‌కు త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. భోజ‌నానికి అర గంట ముందు ఈ కషాయాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts