Kobbaripala Pulao : కొబ్బ‌రి పాల‌తో పులావ్‌.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Kobbaripala Pulao : ప‌చ్చి కొబ్బ‌రిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బరిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందంతో పాటు వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాగే ఈ కొబ్బ‌రి నుండి తీసే కొబ్బ‌రి పాల‌ను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. కొబ్బ‌రి పాలు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బ‌రి పాలు వేసి చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కొబ్బ‌రి పాల‌తో మ‌నం పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు మొద‌టి సారిగా చేసే వారు కూడా ఈ పులావ్ ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా కొబ్బ‌రి పాల‌తో పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి పాల పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మ‌తీ బియ్యం – 3 టీ గ్లాసులు, కొబ్బ‌రి పాలు – 6 టీ గ్లాసులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు – రెండు టేబుల్ స్పూన్స్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – అర క‌ప్పు, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Kobbaripala Pulao recipe in telugu make in this way
Kobbaripala Pulao

మ‌సాలా దినుసులు..

బిర్యానీ ఆకులు – 2, యాల‌కులు – 3, అనాస పువ్వు – 2, మ‌రాఠి మొగ్గ – 2 ( చిన్న‌వి), సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, జాప‌త్రి – 1.

కొబ్బరి పాల పులావ్ త‌యారీ విధానం..

ముందుగా బాస్మ‌తీ బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి త‌గినన్ని నీళ్లు పోసి అర గంట పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడ‌య్యాక మ‌సాలా దినుసులు, జీడిప‌ప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కొత్తిమీర‌, గ‌రం మ‌సాలా వేసి వేయించాలి. ఇప్పుడు నాన‌బెట్టుకున్న బాస్మ‌తీ బియ్యం, కొబ్బ‌రి పాలు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఈ బియ్యాన్ని నీళ్లు అయ్యి పోయే వ‌ర‌కు మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మ‌రో 5 నుండి 8 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

స్ట‌వ్ ఆఫ్ చేసిన త‌రువాత 10 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి పులావ్ త‌యార‌వుతుంది. ఈ పులావ్ త‌యారీలో ఉప‌యోగించిన కొబ్బ‌రి పాల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి కొబ్బ‌రిలో నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత దీనిని ఒక వ‌స్త్రంలోకి తీసుకుని చేత్తో గ‌ట్టిగా పిండితే పాలు వేర‌వుతాయి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల కొబ్బ‌రి పాల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. పాలు త‌క్కువైన వారు పులావ్ లో కొద్దిగా నీటిని కూడా పోసుకోవ‌చ్చు. ఈ పులావ్ ను మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.ఈ విధంగా కొబ్బ‌రి పాల‌తో పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts