Mosquitoes : దోమ‌ల‌కు వీటి వాస‌న ప‌డ‌దు.. వీటిని ఉప‌యోగిస్తే దోమ‌లు ప‌రార్‌..!

Mosquitoes : ప్ర‌స్తుత త‌రుణంలో విష జ్వ‌రాలు విజృంభిస్తున్నాయి. చాలా వ‌ర‌కు జ్వ‌రాలు దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల‌నే వ‌స్తున్నాయి. అందువ‌ల్ల దోమ‌ల‌ను నియంత్రించే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే వాస్త‌వానికి కొన్ని ర‌కాల వాస‌న‌లు దోమ‌ల‌కు ప‌డ‌వు. ఆ వాస‌న ఉందంటే చాలు.. అక్క‌డికి దోమ‌లు అస‌లు వెళ్ల‌వు. అందువ‌ల్ల ఆ వాస‌న వ‌చ్చే ప‌దార్థాల‌ను మ‌నం ఉప‌యోగించాలి. దీంతో ఆ వాస‌న‌ల‌కు దోమ‌లు మ‌న ద‌గ్గ‌ర‌కు రావు. ఇక దోమ‌ల‌కు ప‌డ‌ని ఆ ప‌దార్థాలు ఏమిటంటే..

వెల్లుల్లి వాసన దోమలకు పడదు. వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన దోమలను తరిమి కొడుతుంది. వెల్లుల్లి రసం తీసి బాటిల్‌లో నింపి రూంలలో స్ప్రే చేస్తే ఆ వాసనకు దోమలు పరారవుతాయి. అలాగే తులసి ఆకుల వాసన అన్నా దోమలకు పడదు. వాటి నుంచి తీసిన రసాన్ని నీటితో కలిపి స్ప్రే చేస్తే దోమలు రాకుండా ఉంటాయి. పుదీనా ఆకుల వాసన కూడా దోమలకు నచ్చదు. ఆ రసాన్ని కూడా మనం మస్కిటో రీపెల్లెంట్‌లా ఉపయోగించుకోవచ్చు. పుదీనా వాసనతో దోమలు పరారవుతాయి.

use these ingredients to get rid of Mosquitoes
Mosquitoes

లెమన్ గ్రాస్ మొక్క ఆకుల రసం లేదా వేపాకుల రసం కూడా దోమలను తరిమికొట్టేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక మార్కెట్‌లో మనకు లభించే రసాయన మస్కిటో రీపెల్లెంట్‌లు పడవు అని భావించే వారు పైన తెలిపిన సహజ సిద్ధమైన చిట్కాలను పాటించి దోమలను తరిమి కొట్టవచ్చు. అయితే మనం వదిలే కార్బన్ డయాక్సైడ్, స్ప్రే చేసుకునే పర్‌ఫ్యూమ్‌లు, ఓ గ్రూప్ బ్లడ్ ఉన్నవారు, మన నుంచి వచ్చే చెమటకు కూడా దోమలు బాగా ఆకర్షితమవుతాయి. కనుక ఈ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దోమలు మనల్ని కుట్టకుండా అప్రమత్తంగా ఉండవచ్చు. దాంతో విష జ్వరాలు రాకుండా ఉంటాయి.

Editor

Recent Posts