Vavilaku For Pains : మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యలు కొందరిని ఎల్లప్పుడూ వేధిస్తూ ఉంటాయి. చాలా మంది ఈ నొప్పులను తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. అలాగే రసాయనాలు కలిగిన క్రీములను, జెల్ లను, నూనెలను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఉపశమనం కొంత మేర ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఎటువంటి ఆయింట్ మెంట్ లను వాడే అవసరం లేకుండా సహజంగా కూడా మనం ఈ నొప్పులను మనం తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నొప్పులను తగ్గించడంలో వావిలాకు మనకు ఎంతగానో సహాయపడుతుందని వారు చెబుతున్నారు. వావిలాకుపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు.
వావిలాకులో 45 రకాల రసాయన సమ్మేళనాలు, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. సాధారణంగా శరీరంలో ఇన్ ప్లామేషన్ ఉన్న చోట ఇన్ ప్లామేటరీ మీడియేటర్స్ ఉత్పత్తి అవుతాయి. వీటినే ప్రోస్టా గ్లాండిన్స్ అంటారు. ఈ ఇన్ ప్లామేటరీ మీడియేటర్స్ ను నియంత్రించడం వల్ల నొప్పి తగ్గుతుంది. వావిలాకును ఉపయోగించడం వల్ల దీనిలో ఉండే రసాయన సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ ప్లామేటరీ మీడియేటర్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా నియంత్రణలో ఉండేలా చేస్తాయి. దీంతో ఇన్ ప్లామేషన్ తో పాటు నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే వావిలాకును వాడడం వల్ల నొప్పిని కలిగించే రిసెప్టార్స్ శాంతించబడతాయి. రిసెప్టార్స్ ను శాంతింపజేయడం వల్ల సులభంగా నొప్పి తగ్గుతుంది. అయితే నొప్పులతో బాధపడే వారు వావిలాకును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం మనం వావిలాకు నూనెను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వావిలాకును మెత్తగా మిక్సీ పట్టుకుని దాని నుండి రసాన్ని తీయాలి. ఈ రసానికి ఆవ నూనెను కలిపి నూనె మిగిలే వరకు వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల వావిలాకు నూనె తయారవుతుంది. ఇలా వావిలాకు నూనెను తయారు చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను గోరు వెచ్చగా చేసుకుని నొప్పి ఉన్న చోట రాసుకోవాలి. తరువాత 10 నుండి 15 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేసుకోవాలి. తరువాత వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం చాలా సులభంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, నడుము నొప్పి,భుజాల నొప్పి వంటి వాటిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా వావిలాకు సహజ సిద్దమైన పెయిన్ కిల్లర్ గా పని చేస్తుందని దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.