Curd : ఇలా తోడు పెడితే చాలు.. పులుపు లేకుండా పెరుగు తియ్య‌గా త‌యార‌వుతుంది..!

Curd : మ‌నం ఆహారంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాము. పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట‌లో మేలు చేసే బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా పెరుగు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా పెరుగును వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గడంతో పాటు వృద్దాప్య ఛాయ‌లు కూడా మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఇలా అనేక ర‌కాలుగా పెరుగు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మ‌నం సాధార‌ణంగా తియ్య‌టి పెరుగు తిన‌డానికి ఇష్ట‌ప‌డుతూ ఉంటాము.

కానీ పులిసిన‌ పెరుగును తిన‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పులిసిన పెరుగులో మేలు చేసే బ్యాక్టీరియా శాతం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. పులిసిన పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే పులిసిన పెరుగు తియ్య‌ద‌నం పోయి క్ర‌మంగా పుల్ల‌గా మారుతుంది. మ‌న‌లో చాలా మందికి ఈ పుల్ల‌ద‌నం న‌చ్చ‌దు. పుల్ల‌టి పెరుగును తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఒక చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం పెరుగు పులిసిన‌ప్ప‌టికి పుల్ల‌గా మార‌కుండా చేసుకోవ‌చ్చు. ఈ చిట్కా చాలా చిన్న‌ది. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు. పులిసిన పెరుగు తియ్య‌గా ఉండడానికి గానూ మనం తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. మ‌నం పాలు తోడివేసేట‌ప్పుడే అందులో తేనెను వేసి క‌ల‌పాలి.

make curd like this with sweet taste
Curd

అర లీట‌ర్ పాల‌ల్లో 2 స్పూన్ల‌ తేనెను క‌లిపి తోడు వేయాలి. ఇలాచేయ‌డం వ‌ల్ల పెరుగు పులిసిన‌ప్ప‌టికి పుల్ల‌గా మార‌కుండా తియ్య‌గా ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మ‌నం పులిసిన పెరుగును తియ్య‌గా తిన‌వ‌చ్చు. పుల్ల‌టి రుచి న‌చ్చని వారు ఈ విధంగా పులిసిన పెరుగును తియ్య‌గా మార్చుకుని రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ పెరుగును మ‌ట్టి పిడ‌త‌లో తోడు వేసుకుంటే శ‌రీరానికి మ‌రింత మేలు క‌లుగుతుంది.

Share
D

Recent Posts