చిట్కాలు

Cough : ఈ చిట్కాతో దగ్గు, జలుబు సమస్యలను నిమిషాల్లో న‌యం చేసుకోవచ్చు..!

Cough : వానాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి ఒకదాని వెంట ఒకటి వచ్చి ప్రతి ఒక్కరినీ వేధిస్తూ ఉంటాయి. సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఒకసారి వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎన్ని మందులు వాడినా కూడా ఒక్కోసారి ఉపశమనం కలగకుండా అనేక ఇబ్బందులు పడుతూనే ఉంటాము. సీజనల్ గా వచ్చే ఈ అనారోగ్య సమస్యలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా దగ్గు నుండి ఉపశమనం కలిగి ప్రాణానికి హాయినిస్తుంది. చల్లని వాతావరణం ఎప్పుడైతే వస్తుందో వాటర్ తాగినప్పుడు చల్లని నీరు కాకుండా గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి దానిలో తులసి ఆకులు, అల్లం, మిరియాలు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి వడకట్టుకోవాలి. ఇలా తయారైన ఈ పానీయాన్ని ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం కలిపి తాగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రత అంది దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం ఛాతిలో ఉండే కఫాన్ని బయటకు పంపించి దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

with this remedy you can cure cold and cough

చల్లని వాతావరణం వలన గొంతు నొప్పి సమస్య అధికంగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు వేసుకొని కరిగించుకోవాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని బాగా పుక్కిలించడం ద్వారా గొంతులోని చెడు బ్యాక్టీరియా అనేది బయటకు పోతుంది. తద్వారా గొంతు నొప్పి సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.

Share
Admin

Recent Posts