Blackheads : ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఉంటే అసలు ఏమాత్రం బాగుండదు. దీనికి తోడు బ్లాక్ హెడ్స్ ఒకటి. ఇవి ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి. ముఖంపై అక్కడక్కడా చిన్న చిన్న ముళ్లుల్లా కనిపించే ఇవి ఎక్కువగా ముక్కుపై వస్తుంటాయి. బ్లాక్ హెడ్స్ వస్తే ముఖం అసహ్యంగా కనిపిస్తుంది. అయితే దీనికి చాలా మంది కాస్మొటిక్స్‌ను వాడుతుంటారు. కానీ సహజసిద్ధమైన పద్ధతిలోనే మనం బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు. అందుకు ఎలాంటి క్రీములను వాడాల్సిన పనిలేదు. బ్లాక్ హెడ్స్‌ను తొలగించే సహజసిద్ధమైన చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ హెడ్స్‌ను తొలగించేందుకు మనం ముందుగా ఒక మిశ్రమాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అందుకు గాను 1 టీస్పూన్ తెల్లని టూత్ పేస్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, గోరు వెచ్చని నీళ్లు, టూత్ బ్రష్ అవసరం అవుతాయి. వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
గోరువెచ్చని నీటిలో టూత్ పేస్ట్, బేకింగ్ పౌడర్ లను వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న దగ్గర అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత టూత్ బ్రష్ తీసుకుని మెల్లిగా ఆ మిశ్రమం అప్లై చేసిన దానిపై మసాజ్ చేయాలి. తర్వాత ఒక నిమిషం పాటు దాన్ని అలాగే వదిలేసి పొడి వస్త్రంతో నీట్ గా తుడిచేశాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. బ్లాక్ హెడ్స్ పోయి మీ ముఖం ఎంతో సున్నితంగా మారుతుంది. అంతేకాకుండా ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ చిట్కా బ్లాక్ హెడ్స్‌ను పోగొట్టేందుకు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు.