Kidney Stones : కిడ్నీల్లోని రాళ్ల‌ను క‌రిగించే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు..!

Kidney Stones : మ‌న చుట్టూ ప‌రిసరాల్లో అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు ఉన్నాయి. ఇవి మ‌న చుట్టూ పెరుగుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో నేల ఉసిరి మొక్క ఒక‌టి. ఇది చాలా చిన్న‌గా ఉంటుంది. త‌క్కువ పొడ‌వు పెరుగుతుంది. దీని కొమ్మ‌ల‌కు కాయ‌లు కాస్తాయి. దీన్ని సుల‌భంగానే గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు. అయితే ఈ నేల ఉసిరి మొక్క కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారికి అద్భుతంగా ప‌నిచేస్తుంది. 2004లో సైంటిస్టులు చేసిన ప‌లు ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం.. నేల ఉసిరి మొక్క ఆకుల‌కు కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించే శ‌క్తి ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. అందువ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు ఈ మొక్క ఆకుల‌ను తీసుకోవాలి. ఇక అందుకు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నేల ఉసిరి మొక్క ఆకుల‌ను సేక‌రించి శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టాలి. ఇప్పుడు రెండు క‌ప్పుల నీళ్ల‌ను తీసుకోవాలి. అందులో ఒక రెబ్బ నేల ఉసిరి ఆకుల‌ను వేయాలి. త‌రువాత నీటిని బాగా మ‌రిగించాలి. నీళ్లు రెండు క‌ప్పుల నుంచి ఒక క‌ప్పు అయ్యే వ‌ర‌కు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. త‌రువాత నీటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే తాగేయాలి.

wonderful plant for Kidney Stones
Kidney Stones

ఈ విధంగా నేల ఉసిరి ఆకుల‌తో క‌షాయం త‌యారు చేసుకుని రోజూ రెండు పూట‌లా తాగాలి. ఉద‌యం, సాయంత్రం భోజ‌నం అనంత‌రం ఒక గంట విరామం ఇచ్చి ఈ క‌షాయాన్ని తాగుతుండాలి. దీన్ని నెల రోజుల పాటు తాగితే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. కిడ్నీల్లోని రాళ్లు క‌రిగిపోతాయి. మళ్లీ రాకుండా ఉంటాయి. ఇక ఈ ఆకుల క‌షాయం మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఈ క‌షాయం అందిస్తుంది. క‌నుక దీన్ని ఎక్క‌డ దొరికినా స‌రే ఇంటికి తెచ్చుకుని ఇంట్లో పెంచుకునే ప్ర‌య‌త్నం చేయండి. అనేక విధాలుగా లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts