Pippintaku : ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ప్రసాదించింది. వీటిని ఉపయోగించి మనకు వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఆయుర్వేదం విశిష్టతను తెలుసుకుని ఆయుర్వేదం ద్వారా జబ్బులను నయం చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. కేవలం శారీరక సమస్యలనే కాదు, మానసిక సంబంధమైన సమస్యలను నయం చేయడంలోనూ మొక్కలు మనకు ఉపయోగపడతాయి. ఇవే కాకుండా ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించే మొక్కలు కూడా ఉంటాయి. ఈ మొక్కలు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని తొలగించి ధన ప్రాప్తి కలిగేలా చేస్తాయి.
ఔషధ గుణాలను కలిగి ఉండడంతోపాటు నెగెటివ్ ఎనర్జీని తొలగించి ధన ప్రాప్తిని కలిగించే మొక్కలలో పిప్పింటాకు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనకు ఎక్కడ పడితే లభిస్తూనే ఉంటుంది. దీనిని సంస్కృతంలో హరిత మంజరి అని అంటారు. అలాగే కొందరు కుప్పింటాకు అని కూడా పిలుస్తుంటారు. పిప్పింటాకును ఆయుర్వేదంలోనే కాకుండా జోత్యిష్య శాస్త్ర సంబంధమైన సమస్యలను దూరం చేయడంలోనూ ఉపయోగిస్తుంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కను పూజిస్తుంటారు కూడా.
ధనప్రాప్తి కోసం ఈ మొక్కను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మంచి తిథి ఉన్న రోజు ఈ మొక్క ఆకులను సేకరించి ఎండబెట్టి పొడిలా చేసి సాంబ్రాణిలో కలిపి నిల్వ చేసుకోవాలి. వీలైతే నల్ల ఉమ్మెత్త ఆకులను కూడా సేకరించి ఎండబెట్టి సాంబ్రాణిలో కలపాలి. వీలైనప్పుడలా ఇలా తయారు చేసిపెట్టుకున్న సాంబ్రాణితో సూర్యోదయం కాకముందు, సూర్యాస్తమయం తరువాత ఇంట్లో పొగను వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పగటి పూట ఈ పొగను వేయకూడదు. వేసినా కూడా ఫలితం ఉండదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది. పిప్పింటాకు మొక్క ఆకుల పొడిని ఇంట్లో లేదా దుకాణాలలో ఉంచుకోవడం వల్ల ధన లాభం కలుగుతుంది. ఈ ఆకుల పొడిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో వాతావరణం శుభ్రపడుతుంది. మన శరీరంలో ఉండే ఊపిరితిత్తులకు కూడా మేలు కలుగుతుంది. ఈ మొక్క మనకు ఎక్కువగా వానాకాలంలో లభిస్తూ ఉంటుంది. ఈ మొక్క లభించినప్పుడు ఈ మొక్క ఆకులను మాత్రమే సేకరించి ఎండబెట్టి పొడిలా చేసుకుని ఉపయోగించుకోవాలి.