Boiled Eggs : మనలో అధిక శాతం మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఆమ్లెట్, కర్రీ.. ఇలా ఏ రూపంలోనైనా ఎగ్స్‌ను తింటారు. అయితే మన శరీరానికి వాటి నుంచి సంపూర్ణ పోషకాలు అందాలంటే మాత్రం ఉడకబెట్టిన గుడ్లను మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బాయిల్డ్ ఎగ్స్‌ను తినేందుకు అధిక శాతం మంది కూడా ఆసక్తిని ప్రదర్శిస్తారు. అక్కడి వరకు బాగానే ఉన్నా గుడ్లను ఉడకబెట్టి పొట్టు తీయడంలోనే అసలు సమస్యంతా వస్తుంటుంది. ఒక్కోసారి పొట్టు సరిగ్గా రాక గుడ్డు చితకడం, అందులోని పదార్థం బయటికి రావడం జరుగుతుంటుంది.
అయితే ఈ సమస్యంతా లేకుండా ఉడకబెట్టిన కోడిగుడ్డు పొట్టును సులభంగా ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డును బాగా ఉడకబెట్టిన తరువాత దాన్ని పక్కకు ఉంచి, ఒక చిన్నపాటి గాజు జార్ లాంటి దాన్ని తీసుకోవాలి.
అందులో ఆ గుడ్డును వేసి ఆ జార్ మూతను గట్టిగా బిగించాలి. ఇప్పుడు 4 నుంచి 5 సెకండ్ల పాటు జార్‌ను అటు ఇటు షేక్ చేయాలి. అనంతరం జార్ మూత తీసి గుడ్డు పొట్టు తీస్తే సులభంగా వస్తుంది. అంతే. ఈ చిట్కాను ట్రై చేయండి. దీంతో కోడిగుడ్ల పొట్టును సులభంగా తీయవచ్చు.