Home Tips

ఈ ఆహార ప‌దార్థాల్లో క‌ల్తీ జ‌రిగిందా.. లేదా.. అనే విష‌యాన్ని ఇలా ఈజీగా గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు..!

ఈ కాలంలో ఆహార పదార్థాల లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు ఉంది. అందరూ రోజు వాడే పదార్థాలలోనే కల్తీ జరుగుతున్నా గుర్తించడం కష్టమవుతోంది. మరి వాటిని గుర్తించడం ఎలా ? చక్కెరలో సుద్ద ముక్కలు పొడి లేదా బొంబాయి రవ్వ వంటి వాటిని కలిపేసి కల్తీ చేస్తూ ఉంటారు. పంచదారను నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది. అలా కాకుండా అడుగున రవ్వ లాంటి మిశ్రమం ఏమైనా కనిపిస్తే కల్తీ జరిగినట్లే చెప్పాలి. కొద్దిగా చక్కెరను ఇలా పరీక్షించి ఉపయోగించండి. స్వచ్ఛమైన కొబ్బరినూనె అయితే ఫ్రిజ్లో పెట్టగానే గట్టిగా మారుతుంది. అదే కొబ్బరి నూనెలో వేరే నూనె కలిపి కల్తీ చేస్తే ఎంత సేపు అయినా సరే గట్టిగా మారదు . కల్తీ కొబ్బరినూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది.

జీలకర్ర ని తీసుకొని రెండు చేతుల మధ్య ఉంచి నలపాలి. ఇలా చేసినప్పుడు చేతికి రంగు అంటుకుంటే కల్తీ జరిగినట్టే. కల్తీ అయిన జీలకర్రను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రావచ్చు కెమికల్స్ వేసిన రంగులు వాడటం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

identify like this whether these are adulterated foods or not identify like this whether these are adulterated foods or not

ధనియాల పొడిని కల్తీ చేసినప్పుడు రంపపు పొట్టును వాడతారు. ధనియాల పొడిని నీటిలో వేసి కలిపినప్పుడు కల్తీ అయినది ఐతే రంపపు పొట్టు పైకి తేలిపోతుంది. ఇటువంటి ధనియాల పొడిని వాడితే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.

బెల్లంలో మెటాలిక్ పసుపు రంగును కలిపి కల్తీ చేస్తూ ఉంటారు. కొద్దిగా బెల్లం ని తీసుకుని నీళ్లలో వేసి కరిగించాలి, మంచి బెల్లం అయితే నీటిలో కరిగిపోతుంది అదే కల్తీ బెల్లం అయితే అడుగున తేలిపోతుంది.

Admin

Recent Posts