దోమల కారణంగా ప్రజలు అనేక రోగాల బారినపడి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నారు. వర్షాకాలంలో దోమల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోమల ఒక కారణంగా ఎన్నోరకాల వ్యాధులు ఈ కాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డెంగ్యూ, మలేరియా ,టైఫాయిడ్ ప్రాణాంతక వ్యాధులు అన్నీ ఒక చిన్న దోమ కారణంగా వచ్చేవే. అయితే దోమల బారి నుంచి కాపాడుకోవడానికి ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ ఎంతో అందుబాటులోఉన్నా దోమల నివారణ మాత్రం సాధ్యం అవడంలేదు సరికదా కొత్త పద్దతుల కారణంగా మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అందుకే సహజసిద్ధంగా దోమలను నివారించే పద్ధతులను పాటించడం ఎంతో ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఈ పద్దతులు దోమలని నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతాయట. మరి దోమలని తరిమికొట్టే సహజసిద్ద పద్దతులు ఏమిటో ఒక్క సారి పరిశీలిద్దాం.
వేపనూనె దీపం : వేపకి ఉన్న చేదు ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వేపతో తయారయ్యే ఎలాంటి ఉత్పత్తులు అయినా సరే ఆరోగ్య సంభందిత, చర్మ సౌందర్యానికి ఉపయోగపడేవే. దోమలని తరిమి తరిమి కొట్టడంలో వేప ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. అందుకే మన పూర్వీకులు దోమలు, ఇతర కీటకాలు ఇళ్ళలోకి ప్రవేసించ కుండా వేప నూనెతో దీపాలని తయారు చేసేవారు. అయితే ఇప్పుడు కూడా అలాంటి పద్దతిని పాటించడం వలన దోమలని ఇళ్ళలోకి రాకుండా నివారించవచ్చు. వేప నూనెతో దీపం ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
వేప నూనె పావు లీటరు తీసుకుని అందులో 100 మిల్లీ లీటర్ల కిరోసిన్ జోడించి ఇంటి మధ్యలో పెట్టి ఉంచితే ఆ వాసనకి, పొగకి దోమలు దరి చేరవు. అంతేకాదు ఎక్కడైనా దోమలు గుడ్లు పెట్టినట్టుగా ఉంటే ఈ మిశ్రమంతో కూడిన పొగ వలన అవి నిర్వీర్యం అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వేప నూనె దీపాన్ని ఇంట్లోనే ఉండి తయారు చేసుకుని దోమల బారినుండీ కాపాడుకోండి.