information

మీ ఆధార్ కార్డ్‌ను పీవీసీ( PVC) కార్డ్ రూపంలో సుల‌భంగా పొందండిలా..!

నేటి త‌రుణంలో మ‌న‌కు ఆధార్ కార్డ్ ఎంత అవ‌స‌రం ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. గుర్తింపు కార్డుగానే కాక, ప‌లు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో ఆధార్ క‌చ్చితంగా అవ‌స‌రం అవుతోంది. దీంతో ఆ కార్డును ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర ఉంచుకోవాల్సి వ‌స్తోంది. అయితే అలా ఒరిజిన‌ల్ కార్డును ద‌గ్గ‌ర ఉంచుకుంటే అనుకోకుండా ఒక వేళ అది పోవ‌డ‌మో లేదంటే చిర‌గ‌డ‌మో జ‌రిగితే ఇక దాంతో ఇబ్బందులు త‌ప్ప‌వు. మ‌ళ్లీ కొత్త కార్డు పొందాల్సి ఉంటుంది. ఇదంతా ఓ పెద్ద త‌తంగంలా అనిపిస్తుంది. అయితే ఈ బాధంతా ప‌డ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి..? అని అడ‌గ‌బోతున్నారా..? అయితే దానికి స‌మాధాన‌మే ఈ పీవీసీ కార్డ్స్‌..!

మీ ద‌గ్గ‌ర ఉన్న ఆధార్ కార్డును పీవీసీ కార్డ్ రూపంలో ప్రింట్ తీసుకుంటే ఇక ఒరిజిన‌ల్‌తో ప‌నిలేదు. ఆ పీవీసీ కార్డును ద‌గ్గ‌ర పెట్టుకుంటే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు జిరాక్స్ తీసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే పీవీసీ కార్డ్ రూపంలో ఆధార్‌ను ప్రింట్ చేసుకోవాలంటే అందుకు బ‌య‌ట‌కి ఎక్క‌డికో వెళ్లాల్సిన ప‌ని లేదు. ఎంచ‌క్కా మీ ఆధార్ కార్డ్ ని https://eaadhaar.uidai.gov.in/ అనే సైట్ లో యాక్సెస్ చేసి దాని ద్వారా పీవీసీ కార్డ్‌ను ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

here it is how you can get your aadhar pvc

https://eaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఉండే ఆధార్ పీవీసీ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అనంత‌రం అక్క‌డ మీ ఆధార్ నంబ‌ర్‌, మొబైల్ నంబ‌ర్ త‌దిత‌ర వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయ‌మ‌ని అడుగుతుంది. అక్క‌డ ఆ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసిన త‌రువాత మీ రిజిస్ట‌ర్డ్ ఫోన్ నంబ‌ర్‌కు ఒక ఓటీపీ వ‌స్తుంది. దాన్ని వెరిఫై చేయాలి. అనంత‌రం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో మీ ఆధార్ పీవీసీ కార్డు ఆర్డ‌ర్ అయిపోతుంది. ఈ కార్డు మీకు వారం రోజుల్లోగా స్పీడ్ పోస్టులో ఇంటికి డెలివ‌రీ అవుతుంది. ఇలా మీరు మీ ఆధార్ పీవీసీ కార్డును ఆన్‌లైన్‌లో సుల‌భంగా ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు.

Admin

Recent Posts