information

How To Get Lower Berth In Train : ట్రెయిన్‌లో లోయ‌ర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ల‌ను ఇలా బుక్ చేయాలి.. రైల్వే శాఖ చెప్పిన సూచ‌న‌లు..!

How To Get Lower Berth In Train : నేటి త‌రుణంలో రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డం ఎంత న‌ర‌కంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు స్లీప‌ర్ క్లాస్ కాదు.. ఏకంగా ఏసీ క్లాస్‌ల‌లోనే వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేస్తున్నారు. దీంతో బెర్త్ క‌న్‌ఫామ్ అయిన వారు ప్ర‌యాణం చేయ‌లేక‌పోతున్నారు. అయితే ఇదంతా అటుంచితే కొంద‌రు సీనియ‌ర్ సిటిజెన్ల‌ను లోయ‌ర్ బెర్త్‌లు అస‌లు ల‌భించ‌డం లేదు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే వారు లోయ‌ర్ బెర్త్‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని రైల్వే వారు చెబుతున్నారు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

సాధార‌ణంగా రైళ్ల‌లో రిజ‌ర్వేష‌న్ ఉన్న ఏ సీట్లు అయినా స‌రే ఫ‌స్ట్ క‌మ్ అండ్ ఫ‌స్ట్ స‌ర్వ్ బేసిస్‌లో ఉంటాయి. అంటే.. మీరు ట్రెయిన్‌లో ఏ క్లాస్‌లో రిజ‌ర్వేష‌న్ చేసుకోవాల‌న్నా మీకు లోయ‌ర్ బెర్త్ కావాల‌నుకుంటే చాలా రోజుల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. ఈ విష‌యంలో మీరు ఆల‌స్యం చేస్తే సీట్లు ఉన్న‌ప్ప‌టికీ మీకు లోయ‌ర్ బెర్త్ దొర‌క‌దు. అందువ‌ల్ల ట్రెయిన్ టిక్కెట్ల‌ను బుక్ చేసేట‌ప్పుడు ఎన్ని రోజుల ముందు వీలైతే అన్ని రోజుల ముందు టిక్కెట్ల‌ను బుక్ చేయాలి. దీంతో మీరు పెట్టుకున్న విధంగానే లోయ‌ర్ బెర్త్ మీకు అలాట్ అవుతుంది. ఆల‌స్యం చేస్తే లోయ‌ర్ బెర్త్ ల‌భించ‌దు.

How To Get Lower Berth In Train follow these tips

సీనియ‌ర్ సిటిజెన్లు ఇలా చేయాలి..

అయితే సీనియ‌ర్ సిటిజెన్ల‌కు లోయ‌ర్ బెర్త్ కావాలంటే వారు టిక్కెట్ బుకింగ్ స‌మ‌యంలో సీనియ‌ర్ సిటిజెన్ అని మెన్ష‌న్ చేయాలి. అలాగే లోయ‌ర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే టిక్కెట్ బుక్ చేయ‌మ‌ని కూడా అందులో మెన్ష‌న్ చేయాలి. ఈ రెండింటికీ ట్రెయిన్ టికెట్ బుకింగ్ స‌మ‌యంలో ఆప్ష‌న్లు ఉంటాయి. వీటిని సెలెక్ట్ చేసుకుంటే చాలు. క‌చ్చితంగా లోయ‌ర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే టిక్కెట్ బుక్ అవుతుంది. లేదంటే టిక్కెట్ బుకింగ్ అవ‌దు. ఇలా సీనియ‌ర్ సిటిజెన్లు రైళ్ల‌లో లోయ‌ర్ బెర్త్ టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు.

అయితే మీకు ఎంత ట్రై చేసినా లోయ‌ర్ బెర్త్ ల‌భించ‌క‌పోతే అప్పుడు ట్రెయిన్‌లో వెంట‌నే టీటీఈని మీరు సంప్ర‌దించ‌వ‌చ్చు. మీరు సీనియ‌ర్ సిటిజ‌న్ అయినా లేదా మీకు ఏదైనా ఆరోగ్య స‌మ‌స్య ఉన్నా మీద బెర్త్‌ల‌లో ఉండ‌లేను అని చెబితే అప్పుడు టీటీఈ మీకు లోయ‌ర్ బెర్త్ కేటాయిస్తారు. అది కూడా ల‌భ్య‌త‌ను బ‌ట్టి ఇస్తారు. అందువ‌ల్ల లోయ‌ర్ బెర్త్‌ల విష‌యంలో కాస్త ముంద‌స్తుగా టిక్కెట్ల‌ను బుక్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. లేదంటే లోయ‌ర్ బెర్త్ ల‌భించ‌క‌పోతే స‌మ‌స్యాత్మ‌కంగా ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. అది కొంద‌రికి తీవ్ర‌మైన ఇబ్బందిని క‌లిగిస్తుంది.

Admin

Recent Posts