information

షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా.. అయితే హెల్త్ పాలసీ తీసుకుంటే స‌రి..!

శత్రువైనా జాలిపడి ఒదిలేస్తాడేమో గానీ షుగర్‌ వ్యాధి ఒకసారి వచ్చిందంటే ఒదలదు. అయితే గడిచిన 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగింది. అలాగే షుగర్ లేదా షుగర్ సంబంధిత ఇతర కారణాల వల్ల ప్రతి ఏడు సెకన్లకు ఒకరు చనిపోతున్నారు. ప్ర‌స్తుత స‌మాజంలో పెద్ద వారికే కాదు.. చిన్న పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వచ్చేస్తోంది. మారిన జీవన విధానాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే హెల్త్ పాలసీ తీసుకోవడం మంచింది.

డయాబెటిక్ కేర్ ఖర్చులు ఇటీవల కాలంలో భారీగానే పెరిగాయి. దీంతో కుటుంబాలపై భారం పడుతోంది. షుగర్ వ్యాధికి దీర్ఘకాల ట్రీట్‌మెంట్ అవసరం. అందుకే డయాబెటిక్‌ వ్యాధిని ఎదుర్కొనేందుకు సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది.

if you are suffering from diabetes then take health policy

దీంతో మీకు డబ్బులు ఆదా కావడంతోపాటు నచ్చిన హాస్పిటల్‌లో వైద్యం చేయించుకోవచ్చు. నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకున్న కూడా మీ డబ్బులు మీరు వెనక్కు పొందొచ్చు. దీంతో మీ వైద్య ఖర్చులు తగ్గించుకోవ‌చ్చు.

Admin

Recent Posts