Balakrishna : టాలీవుడ్‌లో అగ్రహీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ 1980-90 నుంచే సంక్రాంతికి పోటీపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఒక ఏడాది చిరంజీవి సినిమా ఘన విజయం సాధిస్తే.. మరో ఏడాది బాలకృష్ణ సినిమా పైచేయి సాధించేది. చివరికి చిరంజీవి చాలా రోజులు సినిమాలకి దూరంగా ఉండి 2017లో రీఎంట్రి ఇచ్చిన ‘ఖైదీ నెం 150’ సినిమాకి కూడా బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో పోటీ తప్పలేదు. ఆ ఏడాది రోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో గతంలో పలకరించారు. రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.
అయితే 2001లో సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. జనవరి 11వ తేదీన బాలయ్య నరసింహనాయుడు, చిరంజీవి మృగరాజు,14న వెంకటేష్ దేవి పుత్రుడు విడుదల కాగా, ఈ మూడు సినిమాల్లో మృగరాజు డిజాస్టర్ గా నిలిస్తే, వెంకటేష్ దేవి పుత్రుడు యావరేజ్ గా నిలిచింది. ఇక ఇందులో బాలయ్య నరసింహనాయుడు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సంక్రాంతికి బాలయ్యకి పెద్ద అన్యాయమే జరిగిందట. ఆ అన్యాయం ఏంటంటే బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాకి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల కేవలం 14 థియేటర్లు మాత్రమే ఇచ్చారట.
మెజారిటీ థియేటర్లన్నీ చిరంజీవి మృగరాజు సినిమాకి మిగతావి వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాకు ఇచ్చారట . తమ అభిమాన హీరో సినిమాకి పెద్దగా థియేటర్స్ దక్కలేదని ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అయితే సినిమాలు విడుదలైన రెండు రోజులకి రిజల్ట్స్ బయటకు రావడంతో దాదాపు అన్ని థియేటర్స్ లో నరసింహనాయుడు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా 175 నుంచి 200 రోజుల వరకు ఆడి బంపర్ లాభాలు తెచ్చి పెట్టింది. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 200 రోజులకు పైగా ఆడి రికార్డు క్రియేట్ చేసింది ఈ చిత్రం. నరసింహనాయుడు చిత్రంపై చెప్పలేనన్ని రికార్డ్స్ ఉన్నాయి.