information

సేవింగ్ ఖాతాలో ల‌క్ష‌లు ఉన్నాయా.. అయితే రెట్టింపు లాభాలు ఇలా పొందండి..!

ఈ మ‌ధ్య కాలంలో దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకులలోనో లేదంటే పోస్టాఫీసులలోనో పొదుపు ఖాతాలు ఉంటాయి. వాటిలో ఎంతో కొంత సొమ్ము నిల్వ ఉంటుంది. ఆ పొదుపు అలాగే కొనసాగుతుంది. దీనిపై సాధారణంగా వడ్డీరేటు చాలా తక్కువగా ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లలో నిర్ణీత కాలానికి సొమ్ము డిపాజిట్ చేస్తాం కాబట్టి దానిపై వడ్డీ అధికంగానే అందజేస్తారు. సేవింగ్స్‌ అకౌంట్‌ లేదా కరెంట్‌ అకౌంట్‌లో డబ్బులు తక్కువగా ఉండటంతో.. ఏదైనా ట్రాన్సాక్షన్‌, పేమెంట్‌ చేయలేకపోతే.. బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి అవసరమైన నగదును సేవింగ్స్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాయి. దీనివల్ల ఎఫ్‌డీ వడ్డీ రేటుపై ఎలాంటి ప్రభావం ఉండదు.

పొదుపు ఖాతాలో నిల్వ ఉన్న సొమ్ముకు మాత్రం వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆటో స్వీప్ విధానం చాలా ఉపయోగపడుతుంది. మీ సేవింగ్ ఖాతాను ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాకు కనెక్ట్ చేసే సాధనాన్నే ఆటో స్వీప్ అంటారు. పొదుపు ఖాతాలో నిల్వ ఉన్న డబ్బులపై అదనపు రాబడి అందజేయడానికి ఆటో స్వీప్ విధానం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది అదనపు నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలోకి ఆటోమెటిక్ గా బదిలీ చేస్తుంది. మీ పొదుపు ఖాతాలో నిర్ణీత పరిమితికి మంచి డబ్బులు ఉన్నప్పుడు వాటికి ఎఫ్ డీ ఖాతాలోకి బదిలీ చేస్తుంది. దీనినే స్వీప్ ఇన్ అంటారు.

if you have money in savings account do like this

ఇలా చేయ‌డం వ‌ల‌న మీరు ఆ డబ్బులపై ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మీ పొదుపు ఖాతా నుంచి పరిమితికి మించి డబ్బులు కావాలని అభ్యర్థించినప్పుడు ఎఫ్ డీలోని సొమ్మలు మీ పొదుపు ఖాతాకు బదిలీ అవుతాయి. దీనిని రివర్స్ స్వీప్ అంటారు.ఆటో స్వీప్-ఇన్ ఆప్షన్‌ సేవింగ్స్‌, ఎఫ్‌డీ అకౌంట్‌ ప్రయోజనాలు అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌, సేవింగ్స్ అకౌంట్‌ లింక్‌ అవుతుంది, మానిటరీ లిమిట్‌ నిర్ణయిస్తుంది. ఎఫ్‌ఢీకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం వల్ల అమౌంట్‌ లిక్విడిటీని కోల్పోదు. సేవింగ్స్‌ అకౌంట్‌కు నిర్ణయించిన లిమిట్‌ను దాటి నగదు ఉన్నప్పుడు.. ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఈ విధంగా సేవింగ్స్ అకౌంట్‌ బ్యాలెన్స్‌కు అదనపు వడ్డీ లభిస్తుంది.

Admin

Recent Posts