Coins : పాత నాణేలు, కరెన్సీ నోట్లకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అవి చాలా విలువ కలిగి ఉంటాయి. కనుకనే వాటిని సేకరించే వారు ఎంతైనా చెల్లించి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఇక ప్రస్తుతం అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి కాబట్టి.. ఇలాంటి నాణేలు, నోట్లను కూడా ఆన్ లైన్‌లోనే కొంటున్నారు. దీంతో పాత నాణేలు, నోట్లు ఉన్నవారు వాటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ సులభంగా డబ్బులు రాబడుతున్నారు. అయితే కింద చెప్పినట్లుగా ఓ ప్రత్యేకత కలిగిన కాయిన్లు మీ దగ్గర గనక ఉంటే.. వాటికి మీరు ఒక్కోదానికి రూ.10 లక్షల చొప్పున పొందవచ్చు. మరి ఆ నాణెం ఏదో.. దాన్ని ఎలా విక్రయించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
2002లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాతా వైష్ణోదేవి చిత్రం కలిగిన ప్రత్యేకమైన రూ.5, రూ.10 నాణేలను విడుదల చేసింది. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం మాతా వైష్ణోదేవి అంటే అష్టైశ్వర్యాలను ఇచ్చే దేవత. కనుక ఆ దేవతను చాలా మంది పూజిస్తుంటారు. ఇక ఆ అమ్మవారి ఫొటోలను ఇంట్లో, దుకాణాల్లో పెట్టి పూజలు చేస్తారు. తమకు ధనం సిద్ధించాలని.. కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. అందుకనే ఆ అమ్మవారిని పూజిస్తుంటారు. అయితే ఆ అమ్మవారి ఫొటో కలిగిన నాణేలు అయితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. కనుకనే ఆ అమ్మవారి ఫొటో కలిగిన నాణేలను కొనేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఆ నాణేలు మీ దగ్గర కనక ఉంటే వెంటనే వాటిని ఆన్‌లైన్ లో విక్రయించి మంచి ధర పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
క్లాసిఫైడ్స్ సైట్ అయిన క్వికర్ (Quikr) గురించి అందరికీ తెలిసిందే. దీంట్లో మనం పాత వస్తువులను కొనవచ్చు. అమ్మవచ్చు. అలాగే నాణేలు, నోట్లను కూడా కొనవచ్చు. అమ్మవచ్చు. ఈ సైట్‌లో ముందుగా ఫోన్ నంబర్, మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత అందులోకి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత మీ దగ్గర ఉన్న నాణేలు లేదా నోట్లకు చెందిన ఫొటోలను తీసి ఈ సైట్‌లో అప్‌లోడ్ చేసి క్లాసిఫైడ్ ప్రకటన ఇవ్వాలి. ఇదంతా ఉచితంగానే చేయవచ్చు. ఇక మీరు పెట్టిన ప్రకటనను చూసి కొనేవారు స్పందిస్తారు. మీరు వారితో ధర మాట్లాడి ఓకే అనుకుంటే ఇచ్చేయవచ్చు. దీంతో మీ దగ్గర ఉండే నాణేలు లేదా నోట్లను వారు కొని మీరు అడినంత డబ్బు ఇస్తారు. ఇలా ఈ సైట్‌లో నాణేలు, నోట్లను అమ్మవచ్చు.
ఇక వైష్ణోదేవి ఫొటో కలిగిన నాణేలు అయితే ఒక్కో కాయిన్‌కు ఏకంగా రూ.10 లక్షల వరకు పొందవచ్చు. ఎందుకంటే వైష్ణోదేవి కాయిన్ ఉంటే అదృష్టం పడుతుందని.. ధనం బాగా సంపాదిస్తారని చాలా మంది నమ్ముతున్నారు. కనుకనే ఈ కాయిన్లకు డిమాండ్ పెరిగింది. ఇక ఈ కాయిన్లు లేదా నోట్లు మీ దగ్గర ఉంటే వెంటనే మీరు కూడా వాటిని ఆన్‌లైన్ లో విక్రయించి లక్షల రూపాయలను పొందవచ్చు.