Bachali Kura : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరలను తీసుకోవడం వలన, అనేక రకాల సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ఆకుకూరల్లో బచ్చలి కూర కూడా ఒకటి. ఎక్కువగా చాలామంది బచ్చలకూరని తింటూ ఉంటారు. బచ్చలకూరని మనం ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. బచ్చలి కూరలో విటమిన్ ఏ, విటమిన్ సి అలానే విటమిన్ కె కూడా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాపర్ కూడా బచ్చలిలో ఉంటాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్, ఫ్లెవనాయిడ్స్ ఇవన్నీ కూడా మనకి బచ్చలిలో ఉంటాయి.
చాలామంది, బచ్చలకూరని తినడానికి ఇష్టపడరు. కానీ, దీని వలన కలిగే లాభాలు చూస్తే, ఖచ్చితంగా బచ్చలి కూరని తింటారు. ఈ ఆకుకూరను తీసుకుంటే, బోలెడు లాభాలు ఉంటాయి. బచ్చలి కూరను తీసుకోవడం వలన, రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళకి, ఔషధంలా పని చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నట్లయితే, రోజూ బచ్చలి కూరని తీసుకోండి. అలానే, అధిక రక్తపోటు సమస్య ఉన్నవాళ్లు, బచ్చలకూరని తీసుకుంటే ఆ సమస్య బాగా తగ్గుతుంది.
హై బీపీ పేషెంట్లు రోజు ఆహారంలో బచ్చలి తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. బచ్చలి ఆకుల్ని రసం కింద చేసుకుని కూడా తీసుకోవచ్చు. బచ్చలి కూరను తీసుకుంటే గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా, ఇది కంట్రోల్ లో ఉంచగలదు. బచ్చలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకలు బలం గా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వాళ్ళు, రోజువారి ఆహారంలో బచ్చలకూరని తీసుకోవడం మంచిదే. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్స్ వంటి వాటి నుండి కూడా దూరంగా ఉండవచ్చు. బచ్చల కూర వలన మూత్ర విసర్జన సమస్యలు తగ్గుతాయి. బచ్చలి తీసుకుంటే పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. బచ్చలి కూరని తప్పకుండా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, బచ్చలకూర దొరికినప్పుడల్లా డైట్ లో చేర్చుకోవడం మంచిది.