మన దేశంలోని కరెన్సీ నోట్లను ఆర్బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ముద్రిస్తుందన్న సంగతి తెలిసిందే. ఒక్క రూపాయి కరెన్సీ నోటు మినహా మిగతా కరెన్సీ నోట్లు అన్నింటిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. అయితే కరెన్సీ నోట్ల మీద I PROMISE TO PAY THE BEARER SUM OF RUPEES అని రాసి ఉండడాన్ని గమనించే ఉంటారు. అయితే అలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసుకుందాం..
సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా మనదేశంలో చలామణిలో ఉన్న నగదుకు సమానమైన బంగారం నిల్వలను కలిగి ఉంటుంది. ప్రతి ఏటా ఆ నిలువలు పెరుగుతుంటాయి. దీంతో అందుకు సమానంగా ఆర్బిఐ కరెన్సీని ప్రింట్ చేస్తూ ఉంటుంది. అందుకే కరెన్సీ నోట్లపై నేను ఈ నోటును కలిగిన వ్యక్తిని నేను… రూపాయలు చెల్లిస్తానని వాగ్దానం చేస్తున్నాను. అని రాసి ఉంటుంది. కనుక ఆ వ్యక్తి ఆర్.బి.ఐ నుంచి ఆ కరెన్సీ నోటుకు సమానమైన విలువ కలిగిన బంగారాన్ని లేదా వస్తువులను తీసుకోవచ్చు. అంటే.. ఆ కరెన్సీ నోటు యొక్క పూర్తి బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే అన్నమాట. అందుకే నోటుపై అ అక్షరాలు రాసి ఉంటాయి. అయితే ప్రస్తుతం మన ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆయన పదవీకాలంలో ముద్రించబడే నోట్లకు శక్తి కాంత దాస్ సంతకం చేస్తారు.
ఎన్ని నోట్లను ముద్రించాలో ఆర్బిఐ ఎలా నిర్ణయిస్తుందంటే? భారతదేశంలో, కరెన్సీ నోట్లను కనీస రిజర్వ్ సిస్టం (ఎంఆర్ఎస్) కింద ముద్రించారు. ఈ వ్యవస్థ 1957 నుండి అమలులో ఉంది. ఈ ఎమ్.ఆర్.ఎస్ కింద ఆర్బిఐ అన్ని సమయాలలో కనీసం 200 మిలియన్ రూపాయల ఆస్తులను నిలుపుకోవాలి. ఈ రెండు వందల కోట్ల రూపాయల్లో 115 కోట్ల రూపాయలు బంగారం రూపంలో.. 85 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో ఉండాలి. రిజర్వులో చాలా సంపద ఉన్న తర్వాత ఆర్బిఐ కి ఆర్థిక వ్యవస్థ అవసరానికి అనుగుణంగా నోట్లను ముద్రించే హక్కు ఉంటుంది.