information

విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు మొబైల్ ని ఎందుకు స్విచ్ ఆఫ్ చెయ్యమంటారు ? దానికి కారణం ఏంటి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీలో చాలామంది విమానంలో ప్రయాణించే ఉంటారు&period; విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది&period; అది కాక కొన్ని నిషేధిత వస్తువులను వెంట తీసుకురాకూడదని సదరు సంస్థలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి&period; అయితే చాలామందికి అంతుచిక్కని విషయం ఏంటంటే&period;&period; విమానాలలో ప్రయాణించేటప్పుడు మీ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని&comma; లేదా ఏరోప్లేన్ మోడ్ లో ఉంచమని పదేపదే ఫ్లైట్ అటెండెంట్ లు కోరుతూ ఉంటారు&period; దీని వెనక ఉన్న కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా&quest; దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భద్రతా కారణాల దృష్ట్యా విమానంలో వివిధ రకాల నిబంధనలు పాటిస్తారు&period; విమానం టేక్ ఆఫ్&comma; ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమంటారు సదరు సిబ్బంది&period; అయితే ఫ్లైట్స్ లో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని అధికారికంగా నిషేధించలేదు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ &lpar;FAA&rpar;&period; కానీ ఫ్లైట్ అటెండెన్స్ మాత్రం మీ మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేయాలని చెబుతుంటారు&period; భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ విధంగా అనౌన్స్మెంట్ చేస్తుంటారు&period; దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్స్&comma; వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే&period; సెల్ ఫోన్ తో పాటు దాదాపుగా అన్ని పర్సనల్ ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి&period; ఇది విమాన కాక్ పిట్ లోని ఏరోనాటికల్ పరికరాలకు అంతరాయం కలిగించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83569 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;flight&period;jpg" alt&equals;"why we need to switch off our mobiles in aero planes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా మీరు అధిక ఎత్తులో ఎగురుతున్నప్పుడు సెల్ ఫోన్లు బలమైన సిగ్నల్స్ పంపుతాయి&period; తద్వారా ఇది భూమిపై నెట్వర్క్ రద్దీకి కూడా కారణం అవుతుంది&period; సెల్ ఫోన్&comma; ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలు&comma; విమానంలోని నావిగేషన్ కు ఉపయోగించే రేడియో తరంగాలు దాదాపుగా ఓకే ఫ్రీక్వెన్సీ లో ఉంటాయి&period; దాంతో కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకు ఇది అంతరాయం కలిగించవచ్చు&period; ఇది ప్రమాదానికి దారి తీసే అవకాశాలను సృష్టిస్తుంది&period; ఈ కారణం చేతనే విమానం టేక్ ఆఫ్&comma; లాండింగ్ సమయాలలో సెల్ ఫోన్&comma; ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయమని ఫ్లైట్ సిబ్బంది కోరతారు&period; అయితే ఇప్పటివరకు ఇలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు చరిత్రలో లేవు&period; కానీ ముందు జాగ్రత్తగా ఇలా ఫోన్స్ ను ఆఫ్ చేయమని చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts