inspiration

గారాబం చేస్తే ఇలా అవుతుందా..? థైరోకేర్ వ్యవస్థాపకుడి అద్భుతమైన పేరెంటింగ్‌ పాఠం..

<p style&equals;"text-align&colon; justify&semi;">అతిగారాబం ఎన్నటికీ అనర్థమే అని మన పెద్దలు చెబుతుంటారు&period; పిల్లల్ని ముద్దు చేయాల్సినప్పుడూ ముద్దు చేయాలి&comma; బాధ్యతయుతంగా ప్రవర్తించకపోతే గట్టిగా మందలించాలి కూడా&period; రెండూ సమతూకంలో ఉండాలి లేదంటే&period;&period;ఎందుకు పనికిరానివారుగా తయారవుతారని హెచ్చరిస్తున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు&period; గారాబం వల్ల చిన్నారులు పాడైపోవడమే గాక అది మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో&period;&period;తెలియజేసే అద్భుతమైన రియల్‌ స్టోరీని షేర్‌ చేసుకున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ&period; వేలుమణి&period; మంచి పేరేంటింగ్‌ కుటుంబానికి ఎలా శ్రీరామరక్షలా ఉంటుందో హైలెట్‌ చేసి మరీ చెప్పారు&period; మరీ కథేంటో చూద్దామా&period; 1980à°² ప్రారంభంలో&comma; డాక్టర్ వేలుమణి BARC&lpar;బాబా అటామిక్‌&ZeroWidthSpace; రీసెర్చ్‌ సెంటర్‌&rpar;లో ఉద్యోగం చేసేవారట&period; ఆ సంపాదనతో తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేదట&period; దాంతో మరోవైపు ట్యూషన్‌లు కూగా చెప్పేవారట వేలుమణి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన ఇంటికి సమీపంలో శివాజీ పార్క్‌లో నివసిస్తున్న ఒక ధనవంతురాలైన మార్వారీ మహిళ ద్వారా ఆయనకు ట్యూషన్‌ చెప్పే అవకాశం లభించింది&period; ఆమె తన కొడుకు నాల్గవ తరగతి చదువుతున్నాడని&comma; అతనికి ట్యూషన్‌ చెప్పాల్సిందిగా వేలుమణిని కోరారట&period; తన కొడుకుకి చదువు రావడమే ముఖ్యం అని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని వేలుమణికి చెప్పారామె&period; ఇప్పటికే నలుగురు ట్యూటర్ల మార్చామని అయినా మా అబ్బాయికి చదువు మాత్రం అబ్బలేదని కూడా వాపోయిందట&period; చదువు వచ్చేలా చేయాలిగానీ&comma; మా అబ్బాయి సంతోషానికి ఆటంకం ఉండకూడదనే షరతు విధించిందట ఆ తల్లి&period; అయితే వేలుమణి మంచి జీతం వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆ అబ్బాయికి ట్యూషన్‌ చెప్పేందుకు అంగీకరించారట&period; కానీ ఆ పిల్లవాడి సంతోషంగా ఉంచేలా పాఠాలు చెప్పడం అనేది కష్టం&period; ఎందుకంటే&period;&period;చదువు రావాలంటే ఒక్కొసారి కష్టపెట్టక తప్పదు&period; అయితే ఆ తల్లి షరతు మేరకు ఆ కుర్రాడికి అలరించేలా కథలు చెబుతూ పాఠాలు చెప్పే యత్నం చేసేవారు వేలుమణి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85345 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;velumani&period;jpg" alt&equals;"parents do not make kids enjoy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంతోషంగా ఉండేలా చూడాలి కాబట్టి ఏవిధంగా బలవంతం చేయడానికి వీలులేదు&period; అందువల్ల వేలుమణి హాస్యభరితమైన కథలతో చదువుపై ఆసక్తికలిగేలా చేశారు&period; అది చూసి ఆ పిల్లాడి తల్లి వేలుమణి జీతాన్ని నెలకు రూ&period; 300 నుంచి రూ&period; 600లకు పెంచేసింది&period; బార్క్‌లో సంపాదించిన దానికంటే అధిక జీతం&comma; పైగా ప్రయాణపు ఛార్జీలు కూడా ఆ తల్లే చెల్లించేదట&period; అయితే అతడికి నేర్పించాల్సిన చదువును నేర్పించలేకపోతున్న అనే అపరాధభావం కలిగి మానేయాలనుకున్నారట వేలుమణి&period; కానీ ఆ కుటుంబం మరింత జీతం పెంచి తన పిల్లాడికి చదువు చెప్పాల్సిందిగా బలవంతం చేశారు&period; దీంతో ఆయన అలా 1983 నుంచి 1984 వరకు అతడికి ట్యూసన్‌ చెప్పడం కొనసాగించారు&period; అంతేగాదు ఆ అదనపు డబ్బుతో తన ఆరోగ్యానికి&comma; ఆంగ్లంలో పట్టు సాధించడానికి వినియోగించుకున్నాడట&period; అయితే ఆ బాలుడికి శతవిధాల చదువు నేర్పించే యత్నం చేసినా&period;&period;ఏం నేర్చుకోలేకపోయాడట&period; చివరికీ&period;&period;కనీసం ఇంటర్మీడియట్‌ కూడా ఉత్తీర్ణుడు కాలేకపోయాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత వేలుమణి కూడా ట్యూటర్‌గా కొనసాగడం మానేయడం వంటివి జరిగాయి&period; అలా దశాబ్దాలు గడిచాక&period;&period; అనూహ్యమైన మలుపు తిరిగింది&period; ఆ సంపన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది&period; అనుకోని విధంగా డాక్టర్ వేలుమణి భార్య చివరికి అదే బాలుడికి థైరోకేర్‌లో హార్డ్‌వేర్ టెక్నీషియన్‌గా ఉద్యోగం ఇచ్చింది&period; ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ&period;&period;ఆ తల్లి తన కొడుకు ఏ కష్టం తెలియకుండా పెరగాలనుకుంది&period;&period;అదే చివరికి కుటుంబానికి శాపంగా మారిపోయింది&period; అంతేగాదు కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడూ&period;&period; కొడుకు ఆసరాగా నిలవలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చిందామెకు&period; గారం తెచ్చిపెట్టే అనర్థం ఇలా ఉంటుంది&period; పరిస్థితులు తారుమారైనప్పుడూ&period;&period; కష్టపడక తప్పదని ఆ తల్లి చెప్పలేకపోయింది&comma; పైగా ఆ పిల్లాడు తెలుసుకోలేడు కూడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-85344" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;thyro-care-velumani&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడ పిల్లల్ని క్రమశిక్షణాయుతంగా పెంచడం అనేది గొప్ప పేరేంటింగ్‌కి సంకేతం&period; దాన్ని చాలా జాగ‌రుకతతో నిర్వహించాలి&period; అదే భవిష్యత్తులో కుటుంబ ఉన్నతికి దోహదపడుతుందని నొక్కి చెప్పారు వేలుమణి&period; నెట్టింట షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ &period;&period;ప్రతి నెటిజన్‌ మనసుని దోచుకుంది&period; సార్‌ ఇది మంచి స్ఫూర్తిదాయకమైన కథ అని డాక్టర్‌ వేలుమణిని ప్రశంసించారు&period; చివరగా వేలుమణి తల్లిదండ్రులు గారాబంగా పెంచకండి&comma; విలాసవంతంగా పెరగాలని కోరుకోవద్దని&period;&period;నేటి కాలానికి అస్సలు పనికిరాదని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts