inspiration

Meghana Pencil Art : పెన్సిల్‌తో బొమ్మ‌లు గీస్తూ.. నెల‌కు రూ.1 ల‌క్ష సంపాదిస్తున్న యువ‌తి..!

Meghana Pencil Art : టాలెంట్ అంటూ ఉండాలి కానీ ఈ రోజుల్లో ఏం చేసి అయినా స‌రే డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు. అవును, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని చాలా మంది త‌మ‌లోని టాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసి దాంతో ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు. ఇక చాలా మంది యాక్ట‌ర్లు, సింగ‌ర్లు, మోడ‌ల్స్‌గా కూడా మారారు. ఇలా సోష‌ల్ మీడియా ఎంతో మందికి ఉపాధిని అందిస్తోంది. అయితే ఆ యువ‌తి కూడా స‌రిగ్గా ఇదే మార్గాన్ని ఎంచుకుంది. త‌న‌లో టాలెంట్ ఉండ‌డంతో సోష‌ల్ మీడియా స‌హాయంతో వేల రూపాయ‌ల డ‌బ్బు సంపాదిస్తోంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ నర్రశాలపల్లి గ్రామానికి చెందిన మేఘన అనే యువతి పెన్సిల్ ఆర్ట్ వేస్తుంది. ఆమెకు చెవులు వినపడవు. మాటలు సరిగ్గా రావు. అయినప్పటికీ ఆర్ట్ మీద ఉన్న ఆస‌క్తితో ఆమె యూట్యూబ్‌లో చూసే బొమ్మ‌లు ఎలా గీయాలో నేర్చుకుంది. త‌ను ఇంట‌ర్మీడియట్ వ‌ర‌కు చ‌దుకుంది. త‌రువాత ఇంట్లోనే ఉంటూ బొమ్మ‌లు గీయడం ప్రాక్టీస్ చేసింది.

this girl earning good income with pencil art

అయితే మేఘ‌న పెన్సిల్‌తో ఎంతో చ‌క్క‌ని బొమ్మ‌లు గీస్తుంది. ఆమె గీసే బొమ్మ‌ల‌ను చూసి స్థానికులు అబ్బుర‌పోయేవారు. అయితే అంత‌టితో ఆమె ఆగ‌కుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ క్రియేట్ చేసి త‌న టాలెంట్‌ని అంద‌రికీ తెలిసేలా చేసింది. దీంతో చాలా మంది త‌మ బొమ్మ‌ల‌ను గీయమ‌ని ఆమెకు ఆర్డ‌ర్లు ఇస్తున్నారు. ఇక ఆమె ఒక్కో బొమ్మ‌కు సుమారుగా రూ.1000 నుంచి రూ.1500 వ‌ర‌కు తీసుకుంటుంది.

రోజుకు మేఘ‌న రెండు బొమ్మ‌లు గీస్తుంది. ఒక్కో బొమ్మ‌ను గీసేందుకు సుమారుగా 4 గంట‌లు ప‌డుతుంద‌ట‌. ఇక ఎమ‌ర్జెన్సీ ఉంటే రాత్రి పూట కూడా బొమ్మ‌లు గీస్తుంద‌ట‌. ఇలా మేఘ‌న రోజుకు రూ.3వేలు.. అంటే నెల‌కు దాదాపుగా రూ.1 ల‌క్ష వ‌ర‌కు సంపాదిస్తాన‌ని చెబుతోంది. దీంతో అందరూ ఆమెను హ్యాట్సాఫ్ అని కొనియాడుతున్నారు. ఆమె టాలెంట్‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీని sirishetti_meghana_ సంద‌ర్శించి మీరు కూడా ఆమెతో బొమ్మ‌లు గీయించుకోవ‌చ్చు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె ఆర్డ‌ర్ల‌ను తీసుకుంటుంది.

Admin

Recent Posts