చిట్కాలు

Whiten Teeth : ఈ నాచుర‌ల్ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ దంతాలు తెల్ల‌గా మెరిసిపోతాయి..!

Whiten Teeth : మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాల్లో దంతాలు కూడా ఒక‌టి. చాలా మంది వీటి ఆరోగ్యంపై దృష్టి పెట్ట‌రు. దంతాల‌ను స‌రిగ్గా తోమ‌రు. నోటిని స‌రిగ్గా శుభ్రం చేయ‌రు. దీంతో నోరు, చిగుళ్లు, దంతాల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. దీంతో దంతాల‌పై పాచి, గార పేరుకుపోతుంటాయి. అయితే కింది చిట్కాల‌ను పాటిస్తే దాంతో దంతాల‌ను శుభ్రంగా మార్చుకోవ‌చ్చు. అలాగే దంతాలు తెల్ల‌గా మారి మెరుస్తాయి. వాటిపై ఉండే పాచి, గార తొల‌గిపోతాయి. ఇక దంతాల‌ను తెల్ల‌గా మెరిసేలా చేసే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయ‌డం వ‌ల్ల దంతాలు, నోరు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. ఉద‌యాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రినూనెను తీసుకుని నోట్లో పోసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి. త‌రువాత ఉమ్మేయాలి. అనంత‌రం మీరు రోజూ వాడే టూత్‌పేస్ట్‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవచ్చు. టూత్‌పేస్ట్ నాచురల్‌ది అయితే ఇంకా మంచిది. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల కొద్ది రోజుల్లోనే మీ దంతాలు మెరుస్తాయి. దంతాల‌పై ఉండే పాచి, గార పోతాయి. అలాగే చిగుళ్లు, నోరు శుభ్రంగా మారుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

follow these natural tips to whiten your teeth

రోజూ యాపిల్స్‌, క్యారెట్లు, కీర‌దోస వంటి పండ్లు లేదా కూర‌గాయ‌ల‌ను తింటుండాలి. ఇవి దంతాల‌ను స‌హ‌జ‌సిద్ధంగా మెరిసేలా చేస్తాయి. నోటిని శుభ్రం చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల దంతాల్లో ఉండే యాసిడ్లు త‌ట‌స్థం అవుతాయి. దీంతో దంతాలు, చిగుళ్ల‌పై యాసిడ్ల ప్ర‌భావం త‌గ్గుతుంది. అలాగే దంతాల సందుల్లో ఉండే పాచి, వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. దంతాలు, చిగుళ్లు శుభ్రంగా ఉంటాయి.

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ను కొద్దిగా తీసుకుని నీళ్ల‌తో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. త‌రువాత బ్ర‌ష్ చేసుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే ఫ‌లితం ఉంటుంది. కొద్ది రోజుల్లోనే దంతాలు తెల్ల‌గా మారుతాయి. అలాగే నారింజ పండు లేదా అర‌టి పండు తొక్క‌ల‌తో దంతాల‌ను తోముతున్నా కూడా వాటిపై ఉండే పాచి, గార పోతాయి. దంతాలు శుభ్రంగా మారుతాయి. దంతాలు తెల్ల‌గా మిల‌మిలా మెరుస్తాయి. ఇలా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల దంతాలు, చిగుళ్లు, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

Admin

Recent Posts