inspiration

తెనాలి పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అది తెనాలిలోని బాలాజీరావు పేట&period;&period; అక్కడ రైల్వే స్టేషన్ వీధిలో మెఘావత్ చిరంజీవి పానీ పూరి అమ్ముతుంటాడు&period;&period; ఆర్థికంగా ఇబ్బందులు పడినా ప్రేవేటు వడ్డీ వ్యాపారుల వద్ద వడ్డీకి డబ్బులు తీసుకునేవాడు కాదు&period; అయితే మెప్మా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే చిరంజీవి ఆ సంస్థ ఇప్పించే బ్యాంక్ రుణాలనే తీసుకునేవాడు&period; అలా 2021లో 10 వేలు&comma; 2022లో 20 వేలు&comma; 2023లో50 వేల రూపాయల చొప్పున రుణం తీసుకున్నాడు&period; తీసుకోవడమే కాదు వాటిని సకాలంలో చెల్లించాడు&period; దీంతో చిరంజీవికి తెనాలి మెప్మాలో మంచి పేరొచ్చింది&period; పెద్ద పెద్ద వ్యాపారులే బ్యాంక్ రుణాలు తీసుకొని ఎగ్గొడుతున్న రోజుల్లో తన వ్యాపారాభివృద్దికి దోహదం చేస్తున్న బ్యాంకులకు సకాలంలో రుణం చెల్లించి చిరంజీవిని బ్యాంకు అధికారులు సైతం మెచ్చుకునే వారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు చిరంజీవి తన బండి వద్ద డిజిటల్ పేమెంట్స్ తీసుకునేవాడు&period; చిన్న బండి వద్ద డిజిటల్ పేమేంట్స్ తీసుకునే విధంగా బ్యాంక్ అధికారులు అతన్ని ప్రోత్సహించారు&period; ఇవన్నీ ఇలా ఉండగా గ‌తంలో తెనాలి పోస్ట్ ఆఫీస్ కు చెందిన అధికారులు చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చారు&period; ఇంటికి వచ్చిన వారిని చూసి మొదట చిరంజీవి కంగారు పడ్డాడు&period; అయితే వచ్చిన అధికారులు పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన వారని తెలుసుకొని ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు&period; అంతే&period;&period; వారు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు&period; స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ముర్ము పంపిన ఆహ్వానాన్ని అధికారులు చిరంజీవి చేతికి అందించారు&period; దీంతో తనకే ఎందుకు ఆహ్వానం అందిందంటూ ప్రశ్నించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82457 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;ganesh&period;jpg" alt&equals;"this panipuri seller from tenali got invitation from president of india " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెప్మాలో రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించడమే కాకుండా డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తున్న చిరంజీవిని గుర్తించి రాష్ట్రపతి ఆహ్వానం పంపినట్లు అధికారులు వెల్లడించారు&period; దీంతో ఆయన ఆనందం మరింత ఎక్కువైంది&period; ఢిల్లీ వేదికగా జరిగిన‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు&period; స్వయంగా రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడంపై ఆయన కుటుంబం హర్షం వ్యక్తంచేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts