international

Iran కు ఇతర ముస్లిం దేశాలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇరాన్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా&comma; చెప్పకుండా రహస్య అణు శక్తి ఎజెండాను చేపట్టిందని అమెరికా&comma; తదితర పాశ్చాత్య దేశాల అనుమానం&comma; అందుకు తగ్గట్టుగానే&comma; భూగర్భ న్యూక్లియర్ రియాక్టర్స్ నిర్మించి ప్రయోగాలు&comma; పరీక్షలు చేస్తున్నట్టు అంతర్జాతీయ అణు పర్యవేక్షక సంస్థ ధృవీకరించింది&period; ఇవి కనక సఫలమైతే విరోధ దేశాలన్నింటినీ ఇరాన్ దుందుడుకుగా చీల్చి చెండాడుతుంది&comma; ఈ పరిస్థితికి ముందుగా బలయ్యేది ఇజ్రాయెల్&comma; ఆ తరవాత వరసగా ఇస్లామిక్ దేశాలు&comma; అవన్నీ కేవలం రెండు మూడు వేల కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి&comma; అణ్వాయుధాలు ఒకసారి చేతికి వస్తే అవి పిచ్చి వాని చేతిలో రాయిలా మారతాయి అని ప్రపంచం మొత్తం à°­à°¯ పడుతుంది&period; మేము అటామిక్ బాంబ్స్ తయారు చేసి మిమ్మల్ని ఈ భూగోళం మీద లేకుండా సర్వ నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ని హడలెత్తిస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటారా&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇస్లామిక్ దేశాలు అయినంత మాత్రాన అన్నీ ఒకే విధంగా ఆలోచిస్తాయి అనుకోరాదు&comma; ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి&comma; న్యూక్లియర్ టెక్నాలజీ వంటి విషయాల్లో పరస్పర సంఘీభావం వంటివి ఏమీ ఉండవు&period; ఈ యుద్ధంలో కేవలం మత కోణమే కాదు&comma; చారిత్రక&comma; ప్రాంతీయ భద్రత&comma; సాంకేతిక అభివృద్ధి వంటి కోణాలు కూడా ఉన్నాయి&period; కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ తాము న్యూక్లియర్ శుద్ధి రంగంలో చాలా పురోగతి సాధించామని గొప్పలు చెప్పుకుంది&comma; ఇంకేముంది పాక్ ఆధ్యర్యంలో ఇస్లామిక్ బాంబు తయారవుతోంది అంటూ మత ఛాందస వర్గాలు అత్యుత్సాహంతో ప్రచారం చేశాయి&comma; అదంతా ఇండియాని అదరగొట్టి&comma; బెదరగొట్టే ఎత్తుగడలో భాగం&comma; అంతకు మించి ఏమీ లేదు&period; 1980 దశకంలో రెండు ముస్లిం దేశాలైన ఇరాన్&lpar; షియా&rpar;&comma; ఇరాక్ &lpar; సున్నీ&rpar; మధ్య ఐదారేళ్ళు భీకర యుద్ధం జరిగింది&comma; అది ముస్లింల‌లోనే ముఖ్య వర్గాల మధ్య సంఘర్షణ అని కూడా అనుకున్నారు&comma; అప్పటి ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ పంతానికి పోయి వేల మందిని రణక్షేత్రంలో బలి పెట్టాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88434 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;iran&period;jpg" alt&equals;"why muslim countries are not supporting iran " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిరిగి 1990 దశకంలో అరబిక్ పండితుల చేత కాకి పురాణాలు చెప్పించి చారిత్రకంగా కువైట్ దేశం ఇరాక్ లో అంతర్భాగం అని వాదించి కబళించాలని చూశాడు&comma; గల్ఫ్ యుద్ధంగా చెప్పుకునే ఆ రణరంగంలో అక్షరాలా కనీసం ఐదు లక్షల మంది చనిపోయినట్టు అంచనా&comma; దుర్మార్గ రాక్షసుడు సద్దాం&period; ఇలాంటి ఉన్మాద ఆలోచనల మధ్య ప్రపంచం అణ్వస్త్ర రహితం కావాలని&comma; సుస్థిర శాంతి&comma; భద్రత ఉండాలని ఇప్పటికే అణ్వాయుధాలు కలిగిన దేశాలు కూడా కోరుకుంటాయి&period; అందుకే అగ్రరాజ్య మైన అమెరికా సహా సంపన్న &comma; ప్రవృద్ధ దేశాలన్నీ ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర మెరుపు దాడుల్ని సమర్థిస్తూ ఉంటాయి&comma; ప్రస్తుతానికైతే ఇరాన్ కు మద్దతుగా రెండు ముస్లిం దేశాలైన పాకిస్తాన్&comma; టర్కీ లు ముందుకొచ్చాయి&comma; అమెరికా మాట వినకుండా పాక్ ఎంత వరకూ నిలబడుతుందో డౌటే&period; అణు శక్తి అనేది అటు మంచికీ&comma; ఇటు చెడుకీ ఉపయోగించగల రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటిది&comma; దాన్ని శాంతి యుత మంచి ప్రయోజనాలకే ఉపయోగిస్తున్నామని ప్రపంచాన్ని నమ్మించే బాధ్యత ఇరాన్ పైనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా కాదని ఠలాయిస్తే…&period;&period; కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అన్నట్టు ఇరాన్ ను ఎవరో ఒకరు ముందుకొచ్చి అదుపు చేయక తప్పదు&comma; ఈ క్రమంలో ఆస్తి నష్టం&comma; జన నష్టం జరగక తప్పదు&comma; అందుకు ముస్లిం దేశాలు సహా యావత్ ప్రపంచ దేశాలు అన్నీ మద్దతు పలుకుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts