Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home international

Iran కు ఇతర ముస్లిం దేశాలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి?

Admin by Admin
June 16, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇరాన్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా, చెప్పకుండా రహస్య అణు శక్తి ఎజెండాను చేపట్టిందని అమెరికా, తదితర పాశ్చాత్య దేశాల అనుమానం, అందుకు తగ్గట్టుగానే, భూగర్భ న్యూక్లియర్ రియాక్టర్స్ నిర్మించి ప్రయోగాలు, పరీక్షలు చేస్తున్నట్టు అంతర్జాతీయ అణు పర్యవేక్షక సంస్థ ధృవీకరించింది. ఇవి కనక సఫలమైతే విరోధ దేశాలన్నింటినీ ఇరాన్ దుందుడుకుగా చీల్చి చెండాడుతుంది, ఈ పరిస్థితికి ముందుగా బలయ్యేది ఇజ్రాయెల్, ఆ తరవాత వరసగా ఇస్లామిక్ దేశాలు, అవన్నీ కేవలం రెండు మూడు వేల కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి, అణ్వాయుధాలు ఒకసారి చేతికి వస్తే అవి పిచ్చి వాని చేతిలో రాయిలా మారతాయి అని ప్రపంచం మొత్తం భయ పడుతుంది. మేము అటామిక్ బాంబ్స్ తయారు చేసి మిమ్మల్ని ఈ భూగోళం మీద లేకుండా సర్వ నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ని హడలెత్తిస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటారా?

ఇస్లామిక్ దేశాలు అయినంత మాత్రాన అన్నీ ఒకే విధంగా ఆలోచిస్తాయి అనుకోరాదు, ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి, న్యూక్లియర్ టెక్నాలజీ వంటి విషయాల్లో పరస్పర సంఘీభావం వంటివి ఏమీ ఉండవు. ఈ యుద్ధంలో కేవలం మత కోణమే కాదు, చారిత్రక, ప్రాంతీయ భద్రత, సాంకేతిక అభివృద్ధి వంటి కోణాలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ తాము న్యూక్లియర్ శుద్ధి రంగంలో చాలా పురోగతి సాధించామని గొప్పలు చెప్పుకుంది, ఇంకేముంది పాక్ ఆధ్యర్యంలో ఇస్లామిక్ బాంబు తయారవుతోంది అంటూ మత ఛాందస వర్గాలు అత్యుత్సాహంతో ప్రచారం చేశాయి, అదంతా ఇండియాని అదరగొట్టి, బెదరగొట్టే ఎత్తుగడలో భాగం, అంతకు మించి ఏమీ లేదు. 1980 దశకంలో రెండు ముస్లిం దేశాలైన ఇరాన్( షియా), ఇరాక్ ( సున్నీ) మధ్య ఐదారేళ్ళు భీకర యుద్ధం జరిగింది, అది ముస్లింల‌లోనే ముఖ్య వర్గాల మధ్య సంఘర్షణ అని కూడా అనుకున్నారు, అప్పటి ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ పంతానికి పోయి వేల మందిని రణక్షేత్రంలో బలి పెట్టాడు.

why muslim countries are not supporting iran

తిరిగి 1990 దశకంలో అరబిక్ పండితుల చేత కాకి పురాణాలు చెప్పించి చారిత్రకంగా కువైట్ దేశం ఇరాక్ లో అంతర్భాగం అని వాదించి కబళించాలని చూశాడు, గల్ఫ్ యుద్ధంగా చెప్పుకునే ఆ రణరంగంలో అక్షరాలా కనీసం ఐదు లక్షల మంది చనిపోయినట్టు అంచనా, దుర్మార్గ రాక్షసుడు సద్దాం. ఇలాంటి ఉన్మాద ఆలోచనల మధ్య ప్రపంచం అణ్వస్త్ర రహితం కావాలని, సుస్థిర శాంతి, భద్రత ఉండాలని ఇప్పటికే అణ్వాయుధాలు కలిగిన దేశాలు కూడా కోరుకుంటాయి. అందుకే అగ్రరాజ్య మైన అమెరికా సహా సంపన్న , ప్రవృద్ధ దేశాలన్నీ ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర మెరుపు దాడుల్ని సమర్థిస్తూ ఉంటాయి, ప్రస్తుతానికైతే ఇరాన్ కు మద్దతుగా రెండు ముస్లిం దేశాలైన పాకిస్తాన్, టర్కీ లు ముందుకొచ్చాయి, అమెరికా మాట వినకుండా పాక్ ఎంత వరకూ నిలబడుతుందో డౌటే. అణు శక్తి అనేది అటు మంచికీ, ఇటు చెడుకీ ఉపయోగించగల రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటిది, దాన్ని శాంతి యుత మంచి ప్రయోజనాలకే ఉపయోగిస్తున్నామని ప్రపంచాన్ని నమ్మించే బాధ్యత ఇరాన్ పైనే ఉంటుంది.

అలా కాదని ఠలాయిస్తే….. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అన్నట్టు ఇరాన్ ను ఎవరో ఒకరు ముందుకొచ్చి అదుపు చేయక తప్పదు, ఈ క్రమంలో ఆస్తి నష్టం, జన నష్టం జరగక తప్పదు, అందుకు ముస్లిం దేశాలు సహా యావత్ ప్రపంచ దేశాలు అన్నీ మద్దతు పలుకుతాయి.

Tags: iran
Previous Post

రైల్వే నెట్‌వ‌ర్క్‌లో ఉన్న డైమండ్ క్రాసింగ్ గురించి మీకు తెలుసా..?

Next Post

రంగ స్థ‌లం మూవీని మిస్ చేసుకున్న స్టార్ బ్యూటీ ఎవ‌రో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.