lifestyle

Liquor : మ‌ద్యం సేవించ‌డంలో చాలా మందికి ఉన్న అపోహ‌లు ఇవే..!

Liquor : చాలా మంది మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా కూడా చాలామంది మద్యానికి అలవాటు పడిపోయారు. అయితే మద్యానికి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అవి చూసేద్దాం. మద్యం తీసుకున్న గంట వరకు డ్రైవ్ చేయొద్దు. గంట తర్వాత చేయొచ్చు అని అంటారు. కానీ నిజానికి మద్యం శరీరం నుండి వెళ్లిపోవడానికి గంట కంటే ఎక్కువ సమయమే పడుతుంది.

అధిక ఆల్కహాల్ కంటెంట్ డార్క్ బీర్ లో ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. కానీ ఇది నిజంగా తప్పు. లైట్ బీర్ రంగు గురించి మాత్రమే కాదు. రుచి, క్యాలరీల గురించి కూడా చూసుకోవాలి. బీర్ రంగు తయారు చేసినప్పుడు దాని గింజలను బట్టి ఉంటుంది. లైట్ బీర్ల కంటే డార్క్ బీర్లలో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది అంటారు. ఇది కూడా నిజం కాదు. అలాగే చాలామంది అంటూ ఉంటారు, తాగినంతా మూత్ర విసర్జన చేస్తారని. కానీ ఇది కూడా నిజం కాదు. తాగినంత మొత్తం మూత్ర విసర్జన చేస్తారనేది కూడా అపోహ మాత్రమే.

alcohol effects and myths to know

ఖాళీ కడుపుతో బీర్ తాగడం కూడా మంచిది కాదు. ఖాళీ కడుపుతో బీర్ తాగితే మిమ్మల్ని మరింత అనారోగ్య సమస్యలకే ఇది గురిచేస్తుంది. అలాగే ఎలాంటి మద్యం తాగాలి అన్నది ముఖ్యం కాదు. నిజానికి ఎంత తాగాలి అనేదే ముఖ్యం. అలాగే డార్క్ డ్రింక్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి అనేది కూడా అపోహ మాత్రమే.

రెడ్ వైన్, విస్కీ, డార్క్ బీర్, బోర్బన్ శరీరానికి హాని చేస్తాయి అనేది అపోహ మాత్రమే. ఈ పానీయాలలో ప్రతి ఒక్క దానికి కూడా ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. రెడ్ వైన్ లో చూసుకున్నట్లయితే పాలీఫినాల్స్ ఎక్కువ ఉన్నాయి. డార్క్ బీర్‌లో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఉన్నాయి. కాబట్టి మీరు అనుకున్నది తప్పు. అలా అని చెప్పి వీటిని అధికంగా తాగ‌రాదు. ఎప్పుడో ఒక‌సారి ఒక పెగ్గు అయితే ఫ‌ర్వాలేదు. కానీ రోజూ తాగితే మాత్రం ఏ మ‌ద్యం అయినా స‌రే మ‌న‌కు హానిని క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా గుర్తుంచుకోవాల్సిందే. లేదంటే న‌ష్ట‌పోతారు.

Admin

Recent Posts