lifestyle

ఊబర్, ఓలా వంటివాటి వల్ల తాము నష్టపోతున్నామని ఆటోవాళ్ళు అంటున్నారు. అయినప్పటికీ చాలామంది ఆటోవాళ్ళు అవే వాడుతున్నారు. దీని వెనుక కారణం ఏమిటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేను తొమ్మిదవ తరగతి వరకు బడికి వెళ్ళింది రిక్షాలో&period; అప్పట్లో ఈ రిక్షాలే మా ఊళ్ళో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు&period; ఎలాగూ ట్రాఫిక్ బాధ లేదు&comma; జేబుకు చిల్లూ పడదు&period; కొందరు తమ రిక్షాలను రంగురంగుల జిలుగులతో&comma; డజన్ల కొద్దీ చిరుగంటలతో అలంకరించేవారు&period; అలాంటి రిక్షాలో వెళ్తుంటే తల అంగుళం పైకి లేచేది&comma; జెయింట్ వీల్ ఎక్కినట్టు&comma; అలౌకికానందంలో&excl; ఆ కాలానికి సహజమైన అమాయకత్వం&comma; తెలియనితనంలో గ్రహించలేదు గానీ నెమ్మదిగా ఆ రిక్షాల మనుగడకు ముప్పు ఈ రూపంలో వచ్చింది&period; రిక్షాలో 2 రుపాయల ప్రయాణం ఆటోలో అయిదు రుపాయలయింది&period; ఎండ&comma; వాన నుండి కాస్త రక్షణనిచ్చేవి కావటంతో భరించగలిగిన వారు రిక్షాలు వదిలి ఆటోరిక్షాలను పట్టుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే టీవీ&comma; ఫ్రిడ్జ్&comma; ఏసీలా ఆటో కూడా అవసరమైన విలాసం అయిపోటానికి ఎక్కువ సమయం పట్టలేదు&period; నన్ను బడికి తీసుకెళ్ళే తాత రిక్షా అమ్మేసి పల్లెకు వెళ్ళిపోయాడు&period; గిరాకీ పెరిగింది&period; ఆటోరిక్షాల గుత్తాధిపత్యం మొదలైంది&period; పది రుపాయల ప్రయాణానికి ఇరవై&comma; ఇరవైకి ముప్పై&comma; ముప్పైకి యాభై&&num;8230&semi; ఆశకు హద్దులు పెరుగుతూ మొత్తానికి మాయమయ్యాయి&period; వేరే ఎంపిక లేక&comma; దరి దారి కానరాక వారి డిమాండుకు తలొగ్గాల్సి వచ్చేది&period; బెంగుళూరు వంటి నగరాల్లో మీటర్ కేవలం అలంకారప్రాయంగా మిగిలి&comma; 3-4 రెట్లు ఎక్కువ కిరాయి గుంజటం పరిపాటి అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88939 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;auto&period;jpg" alt&equals;"auto drivers say they lose because of ola and uber " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుమారు మూడు దశాబ్దాల గుత్తాధిపత్యం&comma; దోపిడీ తరువాత ఆ దోపిడీకి ఈ రూపంలో ముప్పు మొదలైంది&period; ఏసీతో మరింత సౌకర్యవంతం&comma; బుక్ చేసుకోవటం సరళం&period; అయితే&comma; ఆటోలు కావరంతో పట్టించుకోనిది&comma; ఈ క్యాబు వ్యవస్థ అందించినది ఒక ముఖ్యమైన సౌలభ్యం &&num;8211&semi; ఫీడ్‌బ్యాక్ &&num;8211&semi; ప్రయాణికులతో సౌమ్యంగా ప్రవర్తించే వారే డ్రైవర్లుగా మనగలిగే నియమం&period; పైగా &lpar;మొదట్లో&rpar; ఆటోలు దబాయించే రెట్టింపు కిరాయికే కారు లభ్యమయేది&period; మునుపు రిక్షాలకు జరిగింది అన్యాయం అయితే ఈసారి ఆటోలకు జరిగిందీ అన్యాయమేనా&quest; ఈ చేత చేసి ఆ చేత అనుభవించినట్టు&period; వేరే దారి&comma; దిక్కు లేక&period; స్వయంకృతాపరాధం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts