Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఊబర్, ఓలా వంటివాటి వల్ల తాము నష్టపోతున్నామని ఆటోవాళ్ళు అంటున్నారు. అయినప్పటికీ చాలామంది ఆటోవాళ్ళు అవే వాడుతున్నారు. దీని వెనుక కారణం ఏమిటి?

Admin by Admin
June 20, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేను తొమ్మిదవ తరగతి వరకు బడికి వెళ్ళింది రిక్షాలో. అప్పట్లో ఈ రిక్షాలే మా ఊళ్ళో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. ఎలాగూ ట్రాఫిక్ బాధ లేదు, జేబుకు చిల్లూ పడదు. కొందరు తమ రిక్షాలను రంగురంగుల జిలుగులతో, డజన్ల కొద్దీ చిరుగంటలతో అలంకరించేవారు. అలాంటి రిక్షాలో వెళ్తుంటే తల అంగుళం పైకి లేచేది, జెయింట్ వీల్ ఎక్కినట్టు, అలౌకికానందంలో! ఆ కాలానికి సహజమైన అమాయకత్వం, తెలియనితనంలో గ్రహించలేదు గానీ నెమ్మదిగా ఆ రిక్షాల మనుగడకు ముప్పు ఈ రూపంలో వచ్చింది. రిక్షాలో 2 రుపాయల ప్రయాణం ఆటోలో అయిదు రుపాయలయింది. ఎండ, వాన నుండి కాస్త రక్షణనిచ్చేవి కావటంతో భరించగలిగిన వారు రిక్షాలు వదిలి ఆటోరిక్షాలను పట్టుకున్నారు.

అయితే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలా ఆటో కూడా అవసరమైన విలాసం అయిపోటానికి ఎక్కువ సమయం పట్టలేదు. నన్ను బడికి తీసుకెళ్ళే తాత రిక్షా అమ్మేసి పల్లెకు వెళ్ళిపోయాడు. గిరాకీ పెరిగింది. ఆటోరిక్షాల గుత్తాధిపత్యం మొదలైంది. పది రుపాయల ప్రయాణానికి ఇరవై, ఇరవైకి ముప్పై, ముప్పైకి యాభై… ఆశకు హద్దులు పెరుగుతూ మొత్తానికి మాయమయ్యాయి. వేరే ఎంపిక లేక, దరి దారి కానరాక వారి డిమాండుకు తలొగ్గాల్సి వచ్చేది. బెంగుళూరు వంటి నగరాల్లో మీటర్ కేవలం అలంకారప్రాయంగా మిగిలి, 3-4 రెట్లు ఎక్కువ కిరాయి గుంజటం పరిపాటి అయింది.

auto drivers say they lose because of ola and uber

సుమారు మూడు దశాబ్దాల గుత్తాధిపత్యం, దోపిడీ తరువాత ఆ దోపిడీకి ఈ రూపంలో ముప్పు మొదలైంది. ఏసీతో మరింత సౌకర్యవంతం, బుక్ చేసుకోవటం సరళం. అయితే, ఆటోలు కావరంతో పట్టించుకోనిది, ఈ క్యాబు వ్యవస్థ అందించినది ఒక ముఖ్యమైన సౌలభ్యం – ఫీడ్‌బ్యాక్ – ప్రయాణికులతో సౌమ్యంగా ప్రవర్తించే వారే డ్రైవర్లుగా మనగలిగే నియమం. పైగా (మొదట్లో) ఆటోలు దబాయించే రెట్టింపు కిరాయికే కారు లభ్యమయేది. మునుపు రిక్షాలకు జరిగింది అన్యాయం అయితే ఈసారి ఆటోలకు జరిగిందీ అన్యాయమేనా? ఈ చేత చేసి ఆ చేత అనుభవించినట్టు. వేరే దారి, దిక్కు లేక. స్వయంకృతాపరాధం.

Tags: autoolauber
Previous Post

ఉక్రెయిన్ కు మద్దతుగా రష్యాపై అమెరికా యుద్ధం చేయట్లేదు. మరి…ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా ఇరాన్ పై యుద్దం చేయడానికి ఎందుకు ready అవుతున్నది?

Next Post

భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న 10 మంది తెలుగు దర్శకులు!

Related Posts

హెల్త్ టిప్స్

ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

July 13, 2025
వినోదం

ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!

July 13, 2025
lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.