lifestyle

చైనా సైనికులు త‌మ కాల‌ర్స్‌కి ఇలా పిన్స్‌ను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

క్ర‌మ‌శిక్ష‌ణ అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది సైనికులు. వారు అత్యంత క‌ఠిన దిన‌చ‌ర్య‌ను పాటిస్తారు. వారు పాటించే అల‌వాట్లు, దిన‌చ‌ర్య అన్నీ వాళ్ల‌ను అల‌ర్ట్‌గా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంచుతాయి. దీంతో వారు త‌మ బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నెర‌వేరుస్తారు. సైనికులకు ఉన్న‌న్న క‌ఠిన నియ‌మాలు, ప‌ద్ధ‌తులు ఎవ‌రికీ ఉండ‌వు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే సైనికుల విష‌యానికి వ‌స్తే ఆయా దేశాలు భిన్న ప‌ద్ధ‌తుల్లో త‌మ సైనికుల‌కు శిక్ష‌ణ‌ను అందిస్తుంటాయి. దేశాన్ని బ‌ట్టి త‌మ సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చే విధానం మారుతుంది. అయితే అత్యంత క‌ఠిన‌మైన శిక్ష‌ణ విష‌యానికి వ‌స్తే అందులో చైనా మొద‌టి స్థానంలో ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే వారు త‌మ సైనికుల‌కు పెయిన్‌ఫుల్ శిక్ష‌ణ‌ను ఇస్తారు.

సోష‌ల్ మీడియాలో చాలా చోట్ల కొన్ని ఫొటోలను ఇప్ప‌టికే మీరు గ‌మ‌నించి ఉంటారు. చైనా సైనికులు త‌మ కాల‌ర్స్‌కి పిన్స్‌ను పెట్టుకుంటార‌ని అనేక ఫొటోల‌ను ఇప్ప‌టికే చాలా మంది చూసి ఉంటారు. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి కూడా. అయితే అవి నిజ‌మేనా, నిజంగానే చైనా త‌మ సైనికుల‌కు అలాంటి శిక్ష‌ణ‌ను ఇస్తుందా.. అని ఫ్యాక్ట్ చెక్ సంస్థ‌లు ప‌రిశోధ‌న చేశాయి. ఈ విష‌యం నిజ‌మే అని తేల్చాయి. అయితే మ‌రి చైనా ఇలా అత్యంత క‌ఠినంగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తుంది.. వారి సైనికుల కాల‌ర్స్‌కు పిన్స్ పెట్టడం వెనుక కార‌ణాలు ఏంటి..? అని ఆరా తీస్తే..

chinese soldiers collar pins why they put them like that

సాధార‌ణంగా సైనికులంటే అన్ని స‌మ‌యాల్లోనూ అల‌ర్ట్‌గా ఉండాలి. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ప్రాణాలు పోవ‌డ‌మే కాదు, దేశ ర‌క్ష‌ణ కూడా ప్ర‌మాదంలో ప‌డుతుంది. క‌నుక సైనికుల‌ను అన్ని స‌మ‌యాల్లోనూ అల‌ర్ట్‌గా ఉంచేందుకు ఇలా పిన్స్ వాడ‌తార‌ట‌. అలాగే సైనికుల త‌ల, శ‌రీరం ఎల్ల‌ప్పుడూ నిటారుగా ఉండాల‌ని, వంగిపోకూడ‌ద‌ని వారి భావ‌న‌. కాస్త వంగినా పిన్స్ మెడ‌కు గుచ్చుకుంటాయి. దీంతో సైనికుడు అల‌ర్ట్ అవుతాడు. నిటారుగా ఉంటాడు. అలాగే అప్ర‌మ‌త్త‌త సైతం పెరుగుతుంది. ఈ రెండు కార‌ణాల వ‌ల్లే చైనా త‌మ సైనికుల కాల‌ర్స్‌కు పిన్స్ పెడుతోంది. అయితే ఇది చూసిన చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చైనా క్ర‌మ శిక్ష‌ణ గురించి అంద‌రికీ తెలుసు. కానీ మ‌రింత ఇంత దారుణంగా ఉండాలా.. అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Admin

Recent Posts