భయం విషయానికి వస్తే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత అది ఉంటుంది. నికార్సయిన ధైర్యవంతులు ఈ లోకంలో ఎవరూ ఉండరనే చెప్పవచ్చు. అయితే అందరి విషయం పక్కన పెట్టి కేవలం పురుషుల విషయానికి వస్తే వారు పైకి చూసేందుకు ధైర్యంగా ఉంటారు. కానీ లోలోపల కొన్ని విషయాల పట్ల ఎప్పుడూ సీక్రెట్ గా భయాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అందుకు పలు కారణాలు ఉంటాయి. మరి పురుషులు ఏయే అంశాల పట్ల సీక్రెట్‌గా, అంతర్గతంగా భయాన్ని కలిగి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందామా. 1. బాడీ షేప్.. పురుషులు చాలా వరకు బయటకు చెప్పకపోయినా లోలోపల తమ శరీరాకృతి గురించి దిగులు చెందుతారట. ముఖ్యంగా పొట్ట ఎక్కువగా ఉన్న వారు దాని గురించి భయపడతారట. శరీరం ఫిట్‌గా ఎందుకు లేదు అని చింతిస్తారట.
2. డబ్బు.. మహిళల కంటే కూడా పురుషులే డబ్బు విషయం గురించి పదే పదే ఆలోచిస్తారట. తమకు కలిగే ఆర్థిక సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై సతమతమవుతూ భయపడతారట. కానీ దాన్ని పైకి కనబడనీయరు. 3. ఎత్తు.. చాలా మంది ఎత్తు తక్కువగా ఉన్న పురుషులు తమ కన్నా ఎత్తు ఎక్కువగా ఉన్న మహిళలను చూస్తే తట్టుకోలేరట. దిగులు చెందుతారట. తాము ఆ మహిళల కన్నా ఎత్తు తక్కువగా ఉన్నామని ఎవరైనా ఎగతాళి చేస్తారేమోనని భయపడుతారట. 4. ఇతర పురుషులు.. గర్ల్‌ఫ్రెండ్ వేరే పురుషుడితో మాట్లాడితే ఏ బాయ్‌ఫ్రెండ్ సహిస్తాడు చెప్పండి. అమ్మాయిలు కూడా ఇలాగే ఉంటారు. అయితే ముఖ్యంగా పురుషులు మాత్రం ఈ విషయం పట్ల ఎక్కువగా సీక్రెట్ భయాన్ని కలిగి ఉంటారట.
5. సంబంధాలు.. మహిళలతో తక్కువ సంబంధాలను కలిగి ఉండేవారు ఇతర మహిళలతో సంబంధం పెట్టుకోవాలంటే భయపడతారట. తమకు గతంలో ఎవరితోనూ అంత చనువు ఉండకపోవడం, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోవడం వంటి లోపాలు ఉన్నాయని భావించి కొత్త వారితో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చెయ్యడానికి సంకోచిస్తూ భయపడతారట. 6. వెంట్రుకలు.. చాలా మంది పురుషులు తమ ఛాతి, శరీరంలో ఇతర భాగాలపై వెంట్రుకలు ఎక్కువగా లేకపోవడాన్ని ఇష్టపడతారట. కానీ అదే వెంట్రుకలు ఎక్కువగా ఉంటే వాటితో ఎలా నెట్టుకు రావాలా ? అని భయపడతారట. 7. ఆహారం.. పురుషులు తాము తినే ఆహారం పట్ల కూడా భయపడతారట. అడ్డమైన జంక్ ఫుడ్, ఆయిల్ వస్తువులు తింటే లావెక్కుతామేమోనని వారు సందేహిస్తారు.
8. ప్రియురాలు.. తమ ప్రియురాలితో ఉన్న రిలేషన్ షిప్ ఎక్కడ బ్రేక్ అవుతుందో అని కూడా చాలా మంది పురుషులు భయపడుతూ ఆలోచిస్తారట. 9. ప్రియురాలి రిలేషన్స్.. తాము ప్రేమిస్తున్న అమ్మాయికి గతంలో ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ? అనే విషయం పట్ల కూడా పురుషులు ఎక్కువగా ఆలోచిస్తారట. దాని గురించి వారు కలత చెందుతారట. 10. ఎమోషన్స్.. నలుగురిలో ఉన్నప్పుడు దుఃఖం వస్తే ఎలా ? మనం పురుషులం కదా, ఏడ్వకూడదు, ఏడిస్తే బాగుండదు అనే విషయంలోనూ చాలా మంది పురుషులు భయపడతారట.