నిద్ర అనేది మనకు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. దీంతో శరీరం పునరుత్తేజం అవుతుంది. మరుసటి రోజు ఉత్సాహంగా పనిచేయడానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు మనకు నిద్ర వల్ల కలుగుతాయి. అయితే నేటి తరుణంలో బిజీ జీవితంలో చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు. ఒత్తిడి, ఆందోళన, మానసిక వ్యాధులు నిద్రలేమికి కారణమవుతున్నాయి. దీంతోపాటు కొందరికి తరచూ పీడకలలు వస్తుంటాయి. అలా కూడా నిద్రాభంగం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు సరిగ్గా నిద్ర పట్టదు. అయితే అందుకు వాస్తు శాస్త్రం పరిష్కారం చూపుతోంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రించేటప్పుడు దిండు కింద ఒక పటిక బెల్లం ముక్కను పెట్టుకుని నిద్రించండి. దీంతో నిద్ర బాగా పడుతుంది. ప్రశాంతంగా నిద్రపోతారు. ఎలాంటి ఆటంకం కలగదు. పీడకలలు రావు. పాజిటివ్ ఎనర్జీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. దీంతో అన్ని రుగ్మతలు పోతాయి. ముఖ్యంగా దుష్ట శక్తుల బారిన పడకుండా ఉంటారు.
నిద్రించేటప్పుడు దిండు కింద సోంపు గింజలను ఉంచుకోవాలి. దీని వల్ల నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. బాగా నిద్రపోతారు. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. వాస్తు దోషం ఉంటే పోతుంది. దిండు కింద వెల్లుల్లి రెబ్బలు 3, 4 పెట్టుకుని నిద్రిస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఉత్తరం వైపు కాళ్లు పెట్టి దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి. ఇలా చేస్తే బాగా నిద్ర పడుతుంది. పీడ కలలు రావు. నిద్రించేటప్పుడు దిండును బాగా శుభ్రం చేయాలి. ఎలాంటి దుమ్ము, ధూళి ఉండకూడదు. ఇలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
గోరువెచ్చని నీటితో పాదాలను కడగాలి. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని దాంట్లో కొంత కర్పూరం వేసి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మడమలకు రాయాలి. ఇలా చేసి నిద్రిస్తే హాయిగా ఉంటుంది. చక్కగా నిద్ర పడుతుంది.