ఐస్‌క్రీం అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. చిన్నారులు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక పెద్దలు కూడా ఐస్క్రీంలను బాగానే తింటారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఐస్క్రీంలలో ఒక్కో ఫ్లేవర్‌ను ఇష్టపడతారు. అయితే మీకు తెలుసా..? ఎవరైనా వారు ఇష్టపడే ఐస్ క్రీం ఫ్లేవర్లను బట్టి వారి వ్యక్తిత్వం, మనస్తత్వం ఎలా ఉంటుందో సింపుల్‌గా చెప్పవచ్చట. వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాదు, సైంటిస్టులు ఈ విషయంపై ప్రయోగాలు కూడా చేశారు. సాధారణంగా ఎవరికైనా చిన్న తనంలో ఏర్పడే ఐస్ క్రీం ఫ్లేవర్ ఇంటరెస్ట్ పెద్దయ్యాక కూడా అలాగే ఉంటుందట. అంటే చిన్నతనంలో ఎవరైనా ఒకసారి ఏదైనా ఐస్ క్రీం ఫ్లేవర్‌ను ఇష్టపడితే ఇక జీవితాంతం అదే ఫ్లేవర్‌ను ఇష్టంగా తింటారట. దీంతో ఎవరైనా ఇష్టంగా తినే ఐస్ క్రీం ఫ్లేవర్‌ను బట్టి వారు ఎలాంటి వారో సులభంగా చెప్పవచ్చట. మరి ఆ ఫ్లేవర్లు ఏంటో, ఏ ఫ్లేవర్ ఐస్ క్రీం తింటే వ్యక్తుల మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
వెనీలా… వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీం అంటే ఇష్టపడేవారు ఆదర్శభావాలను కలిగి ఉంటారట. వీరు ఏ విషయం పట్ల అయినా హఠాత్తుగా స్పందించి అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారట. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించేందుకు ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారట. అందరితోనూ మంచి సంబంధాలను కలిగి ఉంటారట. గుడ్డిగా ముందుకు పోకుండా వాస్తవంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారట. స్ట్రా బెర్రీ… ఈ ఐస్ క్రీం ఫ్లేవర్‌ను ఇష్టపడేవారు ఎక్కువగా అంతర్ముఖులు అయి ఉంటారు. ఏ విషయాన్ని బయటికి చెప్పరు. లోలోపలే దాచుకుంటారు. బాధ ఉన్నా అంతే. లోలోపల కుమిలిపోతారు తప్ప బయటికి చెప్పరు. ఏ విషయాన్నయినా సహిస్తారు. ఓర్పు ఎక్కువ. ఏ అంశంపైనైనా నిర్ణయం తీసుకోవాలంటే తీవ్రంగా ఆలోచన చేస్తారు.
చాకొలేట్… వీరు లైఫ్‌ను చాలా సింపుల్‌గా తీసుకుంటారు. ఏ విషయం పట్ల అయినా హాస్యాస్పదంగా స్పందిస్తారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఇతరులను చాలా సులభంగా ఆకట్టుకుంటారు. మింట్ చాకొలేట్ చిప్… వీరు ఆశావాద దృక్పథం కలిగి ఉంటారు. చేసే ప్రతి పనిపై నమ్మకంగా, పట్టుదలతో ఉంటారు. అవసరం అయితే ఎవరితోనైనా వాదించేందుకు సిద్ధంగా ఉంటారు. వీరికి డబ్బును మేనేజ్ చేసే నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కసాట్టా… వీరు ఎలాంటి చాలెంజ్‌లను అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. బాగా యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉంటారు. కానీ వీరు నిరాశావాదులుగా ఉంటారు. ఏ విషయం పట్ల అయినా అంత సీరియస్‌గా ఉండరు. ఏదీ ఆశించరు. అయితే ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనే స్వభావం కలిగి ఉంటారు.
కాఫీ ఫ్లేవర్… వీరు పర్ఫెక్షనిస్టులుగా ఉంటారు. ప్రతి విషయంలోనూ 100 శాతం పర్ఫెక్షన్ను కోరుకుంటారు. వీరు భవిష్యత్తు కన్నా వర్తమానంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. చాకొలేట్ చిప్… ఈ ఐస్ క్రీం ఫ్లేవర్‌ను ఇష్టపడేవారు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారు ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకోరు. తమకు చేతనైన సహాయం చేస్తారు. ప్రతి విషయంలో పోటీ పడే తత్వాన్ని కలిగి ఉంటారు. బటర్‌స్కాచ్… ఈ ఐస్ క్రీం ఫ్లేవర్‌ను ఇష్టపడేవారు ముక్కు సూటి స్వభావం కలిగి ఉంటారు. ఏ విషయాన్నయినా ఎదుటి వారి ముఖంపైనే చెప్పేస్తారు. నచ్చకపోతే ఎవరితోనూ సాంగత్యం చేయరు. విడిపోతారు. అయితే ఎవర్నయినా బాగా నమ్మితే వారికి ఎక్కువగా దగ్గరవుతారు. క్లోజ్‌గా ఉంటారు.