lifestyle

భార్య‌ల విష‌యంలో భర్త‌లు పాటించాల్సిన నియ‌మాలు ఇవే.. ఇలా చేస్తే అస‌లు క‌ల‌హాలే రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యకాలంలో విడాకుల సంఖ్య పెరిగిపోయింది&period; చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూస్తూ పెద్దవి చేసుకుంటున్నారు&period; విడాకుల వరకు వెళ్లి వారి వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేస్తున్నారు&period; పెళ్ళై పట్టుమని సంవత్సరం అయినా కాకుండా ఇలా విడిపోతున్న జంటలు ఎన్నో వున్నాయి&period; పెళ్లి అంటే ఏమిటి&quest; అది ఓ పవిత్ర బంధం&period; ఆలూమగలిద్దరూ ఒకరికోసం ఒకరుగా జీవించే అనురాగసాగరం&period; ఆనంద సంగమం&period; ఆ అనుబంధం ఆనందమయం కావాలంటే ప్రేమానురాగాలతో పాటు కొత్త దంపతుల మధ్య చక్కటి అవగాహన అవసరం&period; ఎంత ఆన్యోన్య దాంపత్యమైనా అప్పుడప్పుడూ కొన్ని కీచులాటలుండకపోవు&period; వీటిని ఓవర్ కమ్ చేసి ముందుకు వెళ్లగలిగితే వైవాహిక జీవితం సంతోషంగా గడపొచ్చు అంటున్నారు నిపుణులు&period; బ్యూటిఫుల్ మ్యారీడ్ లైఫ్ కోసం వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తున్నారు&period; భార్యాభర్తలన్నాక అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు&period; ఆ కారణంగా ఎప్పుడైనా చిన్న వాదన జరిగిందనుకోండి&period; ఆ చిరాకుతో ఆమెను వదలి మీరు బయటకు వెళ్లిపో కండి&period; సాయంత్రం సరదాగా బయటకు తీసుకెళ్లి మంచి డిన్నర్ ఇప్పించి ప్రేమతో మాట్లాడితే అలకమాయమవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ గత జీవితం గురించి ఆమెతో అన్నీ నిజాలే చెప్పండి&period; లేదా ఏమీ చెప్పకుండా ఊరుకోండి&period; అంతేకాని అబద్ధాలు అస్సలు వద్దు&period; ఒకవేళ ఆదిగాని బయట పడిందో మీ సంసార నౌక బీటలు వారడం ఖాయం&period; ఒక్క చిన్న అబద్ధం ఆడి ఆ తరువాత మీరెంత నిజా యితీగా ఉన్నా లాభం ఉండదు&period; మిమ్మల్ని ఏ విషయంలోనూ ఆమె పూర్తిగా విశ్వసించదు&period; ఆమె చేస్తున్న పనిని మెచ్చుకోండి&period; ఉదాహరణకి ఆరోజు ఆమె ఇల్లు సర్దే కార్యక్రమం పెట్టుకుందనుకోండి&period; వీలైతే సాయం చేయండి&period; లేదంటే &OpenCurlyQuote;ఎంత బాగా సర్దావు’ అని చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి&period; ఆమె ఉద్యోగస్థురాలైతే ఆమె పనిని మనస్ఫూర్తిగా గౌరవించండి&period; పెళ్లయింది కదాని ఎప్పుడూ ఆమెను అంటిపెట్టుకుని తిరగవద్దు&period; తన పుట్టింటివాళ్లతో&comma; స్నేహితులతో ఆనందంగా గడిపే అవకాశం ఇవ్వండి&period; లేదంటే ఆమె ఆనందాన్నంతటినీ మీరే హరించేశారన్న భావన కలగొచ్చు&period; అలాగే మీకోసం మీరూ కొంత సమయం కేటాయించుకోండి&period; లేదంటే మీకంటూ స్నేహితులు లేకుండా అయిపోతారు&period; మరో ప్రమాదం కూడా ఉంది&period; కొత్త మోజులో బాగా తిరిగి తరువాత మీ వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉంటే పెళ్లయిన మొదట్లో ఉన్నట్లు ఇప్పుడు ఉండటం లేదని అమ్మాయిలు తెగ బాధపడిపోయే అవకాశాలే ఎక్కువ&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87548 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;couples&period;jpg" alt&equals;"husband must follow these rules to make his wife happy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమెకు వేరే అమ్మాయిల్ని చూపించి ఆమె ఎంత బాగుందో ఎంత బాగా డ్రెస్ చేసుకుంటుందో&comma; ఎంత చక్కగా మాట్లాడుతుందో&comma; అంటూ పొగడ్తల కార్యక్రమాన్ని చేపట్టకండి&period; మరొకరితో తనను పోల్చి చూడడం ఏ మహిళా సహించదు&period; అలా చేస్తే అది కచ్చితంగా మీ వైవాహిక జీవితానికి మైనస్సే అవుతుంది&period; మీ భార్యకి మీమీద లేనిపోని అనుమానాలు కలిగించినవారవుతారు&period; బంధుమిత్రుల ముందు మీ అర్ధాంగిని విమర్శించే సాహసం చేయకండి&period; అలా కానీ చేశారా&comma; మీ కొత్త కాపురం లోని ఆనందానికి అడ్డుకట్ట పడినట్లే&period; ఈ కాలం అమ్మాయిలు ఈ విషయంలో అస్సలు రాజీపడరు&period; జాగ్రత్త&period; ఏవి ఉన్నా మీరిద్దరే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి&period; కెరీర్&comma; డబ్బు&comma; పుట్టింటి ఇబ్బందులు&comma; ఇలా దేనిగురించో తీరని ఆవేదనలో ఉండి ఆమె మీతో బాధను పంచుకుంటుం దనుకోండి&period; దాన్ని మీరు తేలికగా కొట్టిపారేయడమో&comma; ఉచిత సలహాలివ్వడమో చేయకుండా ఆమె చెప్పేదాన్ని శ్రద్ధగా వినండి&period; ఆ సమయంలో సలహాలివ్వడం కన్నా సహనంతో వినడమే ఆమెకు ఎంతో ఊరటనిస్తుంది&period; అలాగే&comma; కొన్ని సందర్బాల్లో ఏదో ముఖ్యమైన విషయం గురించి ఆమె చెబుతూనే ఉంటుంది&period; మీరు మాత్రం అదేమీ చెవికెక్కించుకోకుండా టీవీ చూస్తూనో&comma; పేపరు చదువుకుంటూనే ఉంటే అవతలి వాళ్లకి అరికాలిమంట నెత్తికెక్కుతుంది&period; మరోసారి అలాంటి విషయాలు మీతో మాట్లాడరు&period; వేరే వాళ్లతో చెబుతారు&period; అప్పుడు ఫీల్ అయినా లాభం ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ పార్టనర్ తో ఎవరైనా నవ్వుతూ మాట్లాడినా ఆప్యాయంగా ఉన్నా చూసి భరించలేకపోతుంటే దాన్ని అసూయ అంటారు&period; ఇలా కట్టడి చేయడం ఎంత మాత్రం మంచిది కాదు&period; భార్య ఆనందంగా ఉండాలనుకోవాలి కానీ ఆమె ఆనందం మీకు మాత్రమే పరిమితం కావాలనుకుంటే అవతలి వ్యక్తులు జైల్లో బంధించినట్లుగా ఫీలయ్యే ప్రమాదం ఉంది&period; ఒకరి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి మరొకరు సంకెళ్లు వేయాలనుకుంటే త్వరలోనే ఇద్దరూ చెరోదారీ కాక తప్పదు&period; ప్రపంచం మారింది&period; ఇంటిపనిలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి&period; లాండ్రీకి బట్టలు ఇద్దరివీ కలిపి ఇవ్వండి&period; ఆమె టిఫెన్ చేస్తుంటే మీరు కాఫీ కలపండి&period; భోజనాలయ్యాక ఆమె వంటగది సర్దుకుంటుంటే మీరెళ్లి మంచమెక్కకుండా అలసిపోయి నట్లున్నావు&period; గిన్నెలు నేను సర్దుతాను కాని నువ్వెళ్లి కాస్త ఫ్రెష్ అవు అని చెప్పండి&period; అపుడు ఆమె కళ్లలో కనిపించే ఆనందాన్ని గుండె లోతుల్లో భద్రంగా దాచుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts