ఆచార్య చాణక్యుడు రాజకీయ, మానసిక, జ్యోతిష్య, తత్వ శాస్త్రం వంటి మానవునికి సంబంధించిన అనేక విషయాలను తన నీతి శాస్త్రం ద్వారా బోధించారు.. ఇక ఆయన జీవితంలో ఎదగాలి అంటే ఎలా ఉండాలి, భార్యాభర్తల జీవనం సుఖంగా సాగాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను కూడా చెప్పుకొచ్చారు… భార్య భర్తలు ఎలాంటి సమయంలో ఎలా ఉండాలి, బయట వారితో ఎలా మెదగాలి ఇంట్లో ఎలా మెదలాలి అనే విషయాలను కూడా తెలిపాడు. ముఖ్యంగా భర్త తన భార్య దగ్గర ఎలాంటి రహస్యాలను చెప్పకూడదో అలాంటి వాటిని కూడా బోధించాడు.. అవేంటో మనం ఓ లుక్కేద్దాం.. చాణిక్యుడు నీతి శాస్త్రంలో బోధించిన విషయం ప్రకారం..
భర్త తనకు జరిగిన అవమానం భార్యతో అస్సలు చెప్పకూడదట. ఇలా చెప్పడం వల్ల భార్య అర్థం చేసుకోవడం పోను తిరిగి అతనిపైన అరవడం నువ్వు చేతకాని వాడివి అంటూ మాట్లాడే అవకాశం ఉందని చాణిక్యుడు తెలియజేశాడు. అలాగే భర్త తను చేసిన దానధర్మాలను కూడా గోప్యంగా ఉంచాలట.. లేదంటే నువ్వు చేసిన సహాయం ప్రాముఖ్యత తగ్గిపోతుందట. మీలో ఎలాంటి బలహీనతలు ఉన్న భార్యకు చెప్పకూడదు..
ఒకవేళ అలాంటివీ చెప్పినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరిగితే మీ బలహీనతను భార్య ఎత్తి చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బలహీనత అనేది కేవలం భార్యతోనే కాకుండా ఇతరులతో కూడా చెప్పుకోకూడదట, దీని వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని ఆచార్య చాణిక్యుడు తెలియజేశారు.. అలాగే భర్త తన ఆదాయాన్ని సైతం భార్య చెప్పకూడదట.. ఇలా చెప్పుకోవడం వల్ల భార్య మిమ్మల్ని చులకన చేసి ప్రతిసారి మీ ఖర్చుల వివరాలు అడిగి ఇబ్బంది పెట్టే అవకాశముందని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపారు.