భార్యాభర్తల బంధం అంటే కలకాలం నిలిచి ఉండేది. ఎన్ని కష్టాలు, ఆటంకాలు ఎదురైనా కలసి మెలసి ఉంటామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. కానీ కొందరు దంపతులు మాత్రం అనుకోని కారణాల వల్ల విడిపోతుంటారు. అయితే పురుషులు తప్పనిసరిగా కొన్ని విషయాలను తమ భార్యల గురించి గుర్తు పెట్టుకోవాలని పెద్దలు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భార్య అంటే నువ్వు చేసిన తప్పు కాదని గుర్తుంచుకోవాలి. భార్యను నిర్లక్ష్యం చేసే భర్తలు జీవితంలో ఎదగలేరు అన్న సత్యాన్ని గ్రహించాలి. భార్యను మోసం చేస్తే ఏదో ఒక రోజు కచ్చితంగా దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక మహిళను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమెకు ఫేవర్ చేసినట్లు కాదు.
భార్యతో శృంగారంలో రోజూ పాల్గొనడం తప్పేమీ కాదు. భార్య కాకుండా ఇతర మహిళలతో శృంగారం చేయడం అంత ఆసక్తికరంగా ఏమీ ఉండదు. నీ భార్య నీ బానిస కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు కచ్చితంగా నీ భార్య అభిప్రాయం కూడా అడిగి తీసుకో. నీ భార్య కూడా మనిషే. ఆమె అభిప్రాయాలను గౌరవించు. ఆమెకు కూడా జ్ఞానం ఉంటుందని, నైపుణ్యాలను కలిగి ఉంటుందని గుర్తించు. ఇతర మహిళల పట్ల ఉండేది ఆకర్షణ మాత్రమే. నీ భార్యే నీకు గొప్పగా భావించాలి.
నీ ఆధారం లేకుండా నీ భార్య నీ పిల్లలను పెంచలేదు. భార్య ఏదైనా తప్పు చేస్తే క్షమించాలి. కొట్టడం, తిట్టడం పరిష్కారం కాదు. నీ భార్యకు ఏమీ అతీంద్రియ శక్తులు ఉండవు. ఆమెకు నీ సపోర్ట్ కావాలి. నీ నుంచి ప్రేమను ఆశిస్తుంది. దేవుడు కూడా నువ్వు నీ భార్యను ఎలా చూసుకుంటున్నావు అనే విషయాన్నే గమనిస్తాడు. కాబట్టి భార్య పట్ల మర్యాదగా ఉండండి. ఆమెను ప్రేమించండి. ఆమె అభిప్రాయాలను గౌరవించండి.