lifestyle

Dream : ఈ క‌ల వ‌స్తే 6 నెల‌ల్లో చ‌నిపోతార‌ట‌.. ఎలాంటి క‌ల అంటే..?

Dream : నిద్రపోతున్నప్పుడు కలలు రావడం చాలా సహజం. అనేక కలలు వస్తూ ఉంటాయి. ఏ కల వచ్చిందని ఒక్కోసారి గుర్తుంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మనం మర్చిపోతూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లు అయితే పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కలలు మూడు రకాలు ఉంటాయి. ఒకటి జరిగిపోయినవి, ఇంకొకటి జరుగుతున్నవి, మూడవది జరగబోయేవి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలు ఎప్పుడూ భవిష్యత్తును సూచిస్తాయని చెప్తారు. అన్ని కలలు మనకి సహజంగా గుర్తు ఉండవు. కొన్ని మాత్రమే గుర్తుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మరణం వచ్చేముందు మనకి కొన్ని కలలు వస్తాయి.

అదేవిధంగా కొన్ని సంకేతాలు, సూచనలు కూడా కనపడతాయి. శివపురాణం ప్రకారం ఇలాంటివి వస్తే, మరణం తథ్యం. పార్వతి దేవి ఒకరోజు తన భర్త పరమేశ్వరుని ఈ విధంగా అడుగుతుంది. స్వామి మరణానికి సంకేతం ఏమిటి..?, మరణం రాబోతుందని ఎలా తెలుస్తుంది అని.. అప్పుడు శివుడు ఈ విధంగా చెప్తారు.. ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు రంగులోకి మారినా, కొద్దిగా ఎరుపు రంగులోకి మారినా.. ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో చనిపోవచ్చని అర్థం. నీళ్లు, నూనె, అద్దంలో వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు, ఆరు నెలల్లో ఆ వ్యక్తి చనిపోతాడని దానికి అర్థం.

if you get these dream then you will die in 6 months

ఒకవేళ కనిపించినా ఆ నీడకి తలభాగం ఉండదు. అలానే ప్రతి వస్తువు కూడా నల్లగానే కనబడుతుంటే, ఆ వ్యక్తి త్వరలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారని దానికి సంకేతం. ఒక వారం పాటు ఎడమ చేయి మెలి తిరిగిపోయినట్లు అనిపిస్తుంటే, మరణం తథ్యం అని దానికి సంకేతం. వ్యక్తి చనిపోయే ముందు నోరు, నాలుక, చెవులు, కళ్ళు ముక్కు రాయిలా గట్టిగా అయిపోతాయట.

ఇలా కనుక అనిపిస్తే కచ్చితంగా ఆ వ్యక్తి ఆరు నెలల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారు. గుడ్లగూబ గురించి కలలు వస్తే అది మరణ సంకేతం. పావురం, గద్ద, కాకి తలపై కూర్చున్నట్లు కలలో కనపడితే కూడా అది మరణ సంకేతం. చనిపోయే ముందు రోజు పార్వతీ పరమేశ్వరులు కలలో పరామర్శిస్తారట. తీతువు పిట్ట ఇంటి మీద నుండి వెళ్లినా కూడా అది మరణానికి సంకేతమే. ఇటువంటివి చోటు చేసుకుంటే మరణం సమీపంలో ఉందని శివ పురాణం ద్వారా చెప్పబడింది.

Admin

Recent Posts