మనిషన్నాక ఏదో ఒక పనిచేయాలి. అస్తమానం తిని తొంగుంటే ఎవరైనా తిడతారు. ఆఖరుకి ఎవరెవరి ద్వారానో మాటలు పడాల్సి వస్తుంది. అసలు ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒక పనిచేయవచ్చు కదా. నాకు తెలిసిన వారు ఉన్నారు. వారికి చెప్పి జాబ్ ఇప్పించాలా..? అంటూ కొందరు సతాయిస్తుంటారు. సరే.. ఖాళీగా ఉండేవారికి ఇవి ఎప్పుడూ ఎదురయ్యేవే. కానీ ఇలాంటి వారితోపాటు, జాబ్ చేసే కొందరు కూడా తమ జీవితం వృథా అయిపోయిందని తరచూ అనుకుంటూ ఉంటారు. అయితే నిజానికి వారి లైఫ్ మాత్రం వేస్ట్ కాదు. ఎందుకంటే.. అలా లైఫ్ వేస్ట్ అయిందని భావించే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే… ఉదయం నిద్రలేవగానే దేని గురించి ఆలోచించకుండా బెడ్‌మీదనే ఉండి ఫోన్ తీసుకుని కాలక్షేపం చేస్తుంటే.. అలాంటి వారి జీవితం వృథా అవుతున్నట్టే లెక్క.
ఎవరు ఏదడిగినా కాదు, లేదు అనకుండా అవును అని అన్నింటికీ సమాధానం చెబుతుంటే.. అలాంటి వారి లైఫ్ వేస్ట్ అవుతున్నట్టు గ్రహించాలి. ఫేస్‌బుక్‌లో ఎవరి ఫ్రెండ్‌దైనా బర్త్‌డే నోటిఫికేషన్ చూడగానే వెంటనే బర్త్ డే విషెస్ చెప్పకుండా తరువాత చెబుదాంలే అని భావించే వారు జీవితాన్ని వృథా చేస్తున్నట్టే లెక్క. యూట్యూబ్‌లో ఒక నిర్దిష్టమైన పాట లేదా వీడియోలను కంటిన్యూగా చూడకుండా వాటిని పదే పదే మారుస్తూ చూసేవారు జీవితాన్ని వృథా చేస్తున్నట్టేనని తెలుసుకోవాలి. అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్‌ను పదే పదే చెక్ చేసే వారి లైఫ్ వేస్ట్ అవుతున్నట్లు గుర్తించాలి. లైఫ్ వేస్ట్ అయ్యే వారికి, అలా అవుతుందని భావించే వారికి సండే వచ్చినా, ఇతర ఏ హాలిడే వచ్చినా, సాధారణ రోజైనా ఒకేలా అనిపిస్తుంది. పెద్దగా తేడా ఉండదు.
వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన మెసేజ్‌లను చదవరు. కానీ వాటిని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు. ఇలా చేస్తున్నా అలాంటి వారు తమ లైఫ్‌ను వేస్ట్ చేసుకుంటున్నట్లు తెలసుకోవాలి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఫీడ్‌లను అదే పనిగా స్రోల్ చేసే వారి జీవితం వృథా అవుతున్నట్లే లెక్క. పగటి పూట నిద్రించడం, రాత్రి పూట లేట్‌గా పడుకోవడం వంటి లక్షణాలు ఉంటే వారి జీవితం వృథా అవుతుందని తెలుసుకోవాలి. అవసరం ఉన్న వారి కంటే ఎక్కువ మందితో మాట్లాడడం, ఎక్కవ మందిని అడిగి నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటే వారి లైఫ్ వేస్ట్ అవుతున్నట్లు తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌లో పెట్టే పోస్ట్‌లకు పదే పదే కామెంట్లు చేసే వారు, వాటి పట్ల ఆర్గ్యూ చేసే వారు తమ తమ లైఫ్ వేస్ట్ అవుతుందని తెలుసుకోవాలి.
తరువాత ఏం చేయాలి అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేకుండా ఉండేవారి జీవితం వృథా అయినట్లే లెక్క. రాత్రి పూట నిద్రించేటప్పుడు ఈ రోజు మొత్తం వేస్ట్ అయింది అనుకునే వారి జీవితం కూడా వృథా అయిందని తెలుసుకోవాలి.